చరణ్ స్పీడ్ మామూలుగా లేదుగా.. అప్పుడే అక్కడ తేలాడు

నిన్న మొన్నటి వరకు ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ లో మునిగిన రామ్ చరణ్ అప్పుడే శంకర్ సినిమా షూటింగ్ లో తేలాడు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రస్తుతం రామ్ చరణ్ తో పాటు కీలక నటీనటులపై చిత్రీకరణను దర్శకుడు శంకర్ నిర్వహిస్తున్నాడు. రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ లో ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ గా రామ్ చరణ్ మారిపోయాడు. దాంతో శంకర్ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

తమిళ దర్శకుడు శంకర్ ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా భారీ తనంతో పాటు అద్బుతమైన ఎమోషన్స్ మరియు మంచి మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు చరణ్ తో ఆయన తెరకెక్కిస్తున్న సినిమా కూడా సమాజంలో ఉన్న చెడును ఎత్తి చూపిస్తూ ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ మరియు ప్రమోషన్ కార్యక్రమాల వల్ల ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన తదుపరి సినిమా ను మొదలు పెట్టలేదు. కాని రామ్ చరణ్ మాత్రం ఇప్పటికే శంకర్ సినిమా ను మొదలు పెట్టడం తో పాటు సగానికి పైగా పూర్తి చేశాడు. జూన్ లేదా ఆగస్టు లో సినిమా షూటింగ్ ను ముగించే అవకాశాలు ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరో వైపు గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో ఒక సినిమా ను చరణ్ చేయబోతున్నాడు.

రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చరణ్ ఏ సినిమా చేసినా కూడా ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేయడం ఖాయం. అందుకు తగ్గట్లుగా కాస్త ప్లాన్ చేసుకుని భారీ సినిమాలను విడుదల చేస్తే ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ ను చరణ్ దక్కించుకునే అవకాశం క్లీయర్ గా ఉంది. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడితో ఈయన సినిమా చేయడం వల్ల కన్ఫర్మ్ గా అంచనాలు భారీగా ఉంటాయి.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా కీలక పాత్రలో అంజలి కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇంకా ఈ సినిమా లో సునీల్ శ్రీకాంత్ ఇంకా ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు. శంకర్ రోబో 2 తర్వాత ఇండియన్ 2 ను మొదలు పెట్టాడు. కాని కొన్ని కారణాల వల్ల ఇండియన్ 2 సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు చరణ్ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు


Recent Random Post: