చిరుతోనే కాదు చరణ్‌తో కూడా ఫిక్స్‌

మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో ఆసక్తిగా ఉన్న లూసీఫర్‌ రీమేక్‌ కు పలువురు దర్శకులను పరిశీలించారు. చివరకు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్‌ రీమేక్‌ ను చిరంజీవి మొదలు పెట్టబోతున్నాడు. వచ్చే నెలలో లూసీఫర్‌ రీమేక్‌ అఫిషియల్ గా పట్టాలెక్కబోతుంది. తమిళంలో తని ఒరువన్‌ ను తెరకెక్కించిన మోహన్‌ రాజా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తని ఒరువన్‌ తెలుగులో ధృవగా రామ్‌ చరణ్‌ హీరోగా రీమేక్ అయిన విషయం తెల్సిందే. ధృవ సినిమా చరణ్‌ కు మంచి విజయాన్ని అందించింది.

ధృవ ఒరిజినల్ వర్షన్‌ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజాతో రామ్‌ చరణ్‌ ఒక సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడట. లూసీఫర్‌ రీమేక్‌ పూర్తి అయిన వెంటనే చరణ్‌ తో మోహన్‌ రాజా సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటిస్తున్నాడు. తదుపరి సినిమా విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదు. తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మోహన్‌ రాజా దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ సినిమా ఉటుందని అంటున్నారు. అంతకు ముందు ఆచార్య సినిమాలో చరణ్‌ కనిపించబోతున్న విషయం తెల్సిందే. బ్యాక్‌ టు బ్యాక్‌ చిరు, చరణ్‌ లతో సినిమాలు చేసే అవకాశం దక్కినందుకు మోహన్‌ రాజా ఆనందంతో ఎగిరి గంతేస్తున్నాడు.


Recent Random Post: