మా ఇంటి పెత్తనం ఎవరికో ఎందుకిస్తాను: రాజీవ్ కనకాల

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్‌కే సపోర్ట్‌ చేస్తున్నట్టు నటుడు రాజీవ్‌ కనకాల స్పష్టం చేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో నాలుగు రోజుల్లో జరుగనున్న ‘మా’ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

‘గతేడాది జరిగిన ‘మా’ ఎన్నికల్లో నేను శివాజీ రాజా ప్యానెల్‌ నుంచి పోటీ చేసి కోశాధికారి పదవి పొందాను. ఆ ప్యానెల్‌ నుంచి గెలిచింది నేనొక్కడినే. నరేశ్‌ టీమ్‌తో కలిసి సభ్యుల సంక్షేమం కోసం ఎంతో పనిచేశా. అవకాశాల్లేని ఎంతోమంది ఆర్టిస్టుల కోసం కష్టపడ్డాం. 40 మందికి అవకాశాలు వచ్చేలా చేశాం. కానీ, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ తీవ్రమైంది. అభ్యర్థులు ‘మా’ గురించి ఎన్నో కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో నేను విష్ణు ప్యానెల్‌కే మద్దతిస్తున్నాను. ‘మా’ బిల్డింగ్‌ నిర్మాణం, సభ్యుల సంక్షేమంపై విష్ణు పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఆయనే గెలుస్తారని ఆశిస్తున్నారు. విష్ణుకు బాలకృష్ణ సపోర్ట్‌ చేస్తున్నట్లు చెప్పారు. మహేశ్‌, ప్రభాస్‌ ఎన్టీఆర్‌.. ఇలా ఇతర నటీనటులు కూడా ఆయనకే మద్దతు ఇవ్వొచ్చని అనుకుంటున్నాను.

ప్రకాష్ రాజ్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘మరో విషయం.. మా ఇంటికి ఎవరైనా బంధువు వస్తే అతనికి సకల మర్యాదలు చేస్తాను. అన్ని రకాలుగా అతిథ్యం కల్పిస్తాను. కానీ, మా ఇంటి సమస్యల్లో అతను పెద్దరికం తీసుకుంటానంటే నేనెందుకు ఒప్పుకుంటాను?’ అని అన్నారు.


Recent Random Post: