‘పుష్ప’ విలన్‌ కు తప్పిన పెద్ద ప్రమాదం

మలయాళ స్టార్‌ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే స్టార్‌ గా కొనసాగుతున్నాడు. తమిళం మరియు మలయాళ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. పుష్ప సినిమాలో కీలకమైన విలన్‌ పాత్రలో నటిస్తున్న ఫాహద్‌ ఇటీవల పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డాడు. ఆయన షూటింగ్‌ సమయంలో ఎత్తు నుండి కింద పడ్డాడట. ఫహద్‌ ప్రమాదం గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన తనకు జరిగిన ప్రమాదం గురించి అభిమానులకు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.

మలయాన్‌ కుంజు సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న సమయంలో ఎత్తు నుండి కింద పడ్డాను. తల బలంగా నేలకు తాక బోతున్న సమయంలో చేతులు పెట్టాను. ఆ సమయంలో చేతులు పెట్టకుంటే తలకు ఖచ్చితంగా పెద్ద తలిగే ఉండేది. అదృష్టం కొద్ది ఈ ప్రమాదం నుండి కూడా బయట పడ్డాను. ముక్కుకు చిన్న గాయం అయ్యింది. మూడు కుట్టు పడ్డాయి. నొప్పి ఉంది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను అనే నమ్మకం ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.. పుష్ప సినిమా ఆగస్టులో విడుదలకు సిద్దం అవుతుండగా ఈయన హీరోగా నటించిన మలయాళ మూవీ మాలిక్ ఓటీటీ రిలీజ్కు సిద్దం అవుతోంది.


Recent Random Post: