సంపన్నుల పిల్లలే టార్గెట్ గా టాప్ హీరోయిన్ లీలలు

బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపింది. ఈ రాకెట్ లో బంగ్లాదేశ్ టాప్ హీరోయిన్ పోరీ మోనిని రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ర్యాబ్) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పోరి మోనికి సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

తాజాగా పోర్నోగ్రఫీ వ్యవహారం కూడా తెరపైకి రావడం సంచలనమైంది. పోరీ మోని డ్రగ్స్ రాకెట్ ఒక్కటే కాదని.. సంపన్నుల పిల్లలకు అమ్మాయిలను ఎరవేసి కోట్లు కూడబెట్టినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ కిలాడీ మోనీ మోసానికి చాలా మంది పాపులయ్యారని.. అనేకమమంది బాధితులుగా మారారని ఆరోపణలు వస్తున్నాయి. హీరోయిన్ నుంచి లేడి విలన్ గా మారినట్లు పేర్కొంటున్నారు.

బంగ్లా రాజకీయ నేతలు వ్యాపారవేత్తలను మోని తన బుట్టలో వేసుకొని ఎన్నో నేరాలకు పాల్పడిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆగస్టు 4న అరెస్ట్ అనంతరం పోరి మోనీ ఇంట్లోనే విదేశీ మద్యం డ్రగ్స్ ను పెద్దఎత్తున స్వాధీన ంచేసుకున్నారు. సోదాల్లో ఓ సీడీ ఒకటి పోలీసులకు దొరికింది. దాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు చూసి అవాక్కయ్యారు.

సంపన్నులకు అమ్మాయిలను ఎరవేసి మోని కోట్లాది రూపాయలు సంపాదించినట్టు సమాచారం. సంపన్నులు వ్యాపారులు డబ్బున్న వారే ఆమె టార్గెట్ అని.. వారితో పరిచయాలు పెంచుకొని అందమైన అమ్మాయిలను పరిచయం చేసేదని పోలీసులు తెలిపారు. అలా వారి కోరికలు తీర్చుతూ బోలెడంత డబ్బులు పోరీ మోని పోగేసినట్టు సమాచారం.ఈ అశ్లీల రాకెట్ లో చాలా మంది రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని సీఐడీ అదనపు డీఐజీ తెలిపారు.

బంగ్లాదేశ్ అగ్రకథానాయిక పోరీ మోనీ (28) అరెస్ట్ బంగ్లాదేశ్ లో సంచలనం సృష్టించింది. పెద్దఎత్తున డ్రగ్స్ కలిగి ఉందన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ‘రాబ్’ ఆమెను అరెస్ట్ చేసింది.అయితే ఇదే హీరోయిన్ పోరీ మోనీ ప్రముఖ బంగ్లాదేశ్ వ్యాపారవేత్తపై లైంగిక-హత్యారోపణలు చేసింది. అది జరిగిన కొద్దిరోజులకే ఆమె అరెస్ట్ కావడంతో ఇందులో కుట్ర ఉందని.. న్యాయం చేయాలని ఆమె అభిమానులు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను న్యాయం కోసం నిలదీస్తున్నారు. పోలీసులు ఢాకాలోని బనానీలో ఉన్న ఆమె ఇంటికి చేరుకొని సోదాలు నిర్వహించారు. ఆ పై రాత్రి ఆమెను అరెస్ట్ చేసి హెడ్ క్వార్టర్ కు తరలించారు. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున మత్తు మాదకద్రవ్యాలు ఫారిన్ లిక్కర్ దొరికాయని.. అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు. గురువారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టగా.. నాలుగు రోజుల రిమాండ్ విధించింది.

పోరీ మోనీ చిన్న వేశాలు వేస్తూ స్టార్ హీరోయిన్ గా బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో ఎదిగింది. జూన్ 8న ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు నజీర్ ఉద్దీన్ మహ్మద్ మీద లైంగిక ఆరోపణలు చేసింది.బోట్ క్లబ్ వద్ద నజీర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఒక స్టార్ హీరోయిన్ లైంగిక ఆరోపనలు చేయడం సినీ పరిశ్రమను కుదిపేసింది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని మంత్రులతో స్నేహం ఉండడంతో కేసు నమోదు కాకుండా నజీర్ తప్పించుకున్నాడన్న ప్రచారం మొదలైంది. ఈ తరుణంలో నటికి సోషల్ మీడియాలో ప్రజల్లో మద్దతు వెల్లువెత్తింది.ఇక తనకు న్యాయం చేయాలంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఆమె ఫేస్ బుక్ ద్వారా విజ్ఞప్తి చేసింది. దీంతో నజీర్ ను ముగ్గురు మహిళలను డ్రగ్ డీలర్ తుహిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నజీర్ అరెస్ట్ అయిన వారానికే గుల్షన్ అల్ కమ్యూనిటీ వాళ్లు పోరీ మోనీపై ఉల్టా కేసులు దాఖలు చేశారు. నజీర్ కు చెందిన క్లబ్ యే ఇదీ.. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు కాగా.. అరెస్ట్ చేశారు. పోరీ మోనీ ఫేస్ బుక్ లో ఆందోళన వ్యక్తం చేసింది. తన ఇంటి గేట్ ను ధ్వంసం చేవఆరని.. చంపాలని చూస్తున్నారని.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చెందింది. కాసేపటికే ఆమెను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడంతో ఇదంతా వ్యాపారవేత్త నజీర్ కుట్ర అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే పోరీ మోనీ వ్యవహారాలు విచారణలో బయటపడడడంతో సంచలనమవుతోంది. ఈమె విషయాలు బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. సంపన్నుల పిల్లలకు అమ్మాయిలను సప్లై చేసినట్టు తేలడంతో ఈ కేసులో ఆమెకు ఉచ్చు బిగుసుకుంటోంది.


Recent Random Post: