పవన్, ఎన్టీఆర్ సినిమాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన జెర్సీ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. ఈ ఆనంద సమయంలో నిర్మాత నాగవంశీ మీడియాను కలిసాడు. ఈ నేపథ్యంలో మీడియా నుండి నాగవంశీకి ఎక్కువగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సినిమాల గురించే ప్రశ్నలు ఎదురయ్యాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పవన్ – రానా హీరోలుగా అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా రీమేక్ షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమా దాదాపు 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుందని తెలిపాడు నాగ వంశి. సినిమా బాగా వస్తోందని ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలియజేసాడు. అలాగే హారిక అండ్ హాసిని సంస్థ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే సినిమాను నిర్మించనుంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ చివర్లో కానీ మే మొదటి వారంలో చిత్రీకరణ మొదలవుతుందని తెలియజేసాడు నిర్మాత.


Recent Random Post: