ఇన్నోవేటివ్ స్క్రిప్టులకు పవర్ స్టార్ వెల్ కమ్!

రొటీనిటీకి కాలం చెల్లింది! కొత్తదనం.. యూనిక్ నెస్.. వెర్సటైలిటీ.. భారీతనం నిండిన విజువల్స్ ని ప్రజలు కోరుకుంటున్నారు. స్ఫూర్తివంతమైన బయోపిక్ లు .. హిస్టారికల్ కాన్సెప్టులు .. తెరమరుగైన వీరుల కథలకు ప్రాధాన్యత పెరిగింది. మునుముందు జనరేషన్ ఛేంజ్ పరిశ్రమలో చూడబోతున్నాం. ఇటీవల టాలీవుడ్ సహా సౌతిండస్ట్రీలో మారుతున్న ఫేజ్ అంతకంతకు ఆశ్చర్యపరుస్తోంది. పాన్ ఇండియా కథల వెల్లువతో పాటు కొత్తదనం నిండిన కథాంశాలకు కథానాయకులు ప్రాధాన్యతనిస్తున్నారు. వాటికే ప్రజాదరణ కూడా దక్కుతోంది. డిజిటల్ – ఓటీటీ రంగ ప్రవేశంతో క్రియేటివిటీ అనేది మరో లెవల్ కి చేరుకుంటోంది.

మారుతున్న ఫేజ్ కనుగుణంగానే ప్రభాస్ సహా రామ్ చరణ్.. అల్లు అర్జున్.. ఎన్టీఆర్ వంటి స్టార్ల ప్రాజెక్టుల ఎంపిక మారిపోయింది. ఇప్పుడు అదే బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై సంతకాలు చేస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత వచ్చినా నేటితరంతో పోటీపడే దిశగా తన ఇమేజ్ ని తగ్గించని కథాంశాల్ని ఎంచుకుంటేనే ఇన్నోవేటివ్ స్క్రిప్టులను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అతను భీమ్లా నాయక్ .. హరి హర వీర మల్లు లాంటి వైవిధ్యం ఉన్న స్క్రిప్టులను ఎంచుకున్నాడు. ఆ తర్వాతా దర్శకుడు హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డితో చేయబోయే సినిమాలు కథాంశం పరంగా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిసింది. ఆ ఇద్దరూ వినిపించిన లైన్ కి ఓకే చెప్పినా బౌండ్ స్క్రిప్టు ఫైనల్ చేసే ముందు ఆ ఇద్దరికీ పరీక్ష తప్పదని చెబుతున్నారు.

వీటన్నిటినీ మించి పవన్ మరో రెండు సినిమాలకు సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తాజాగా లీకులు అందాయి. ఈసారి ఎంపిక చేయబోయే రెండు సినిమాలు యువ దర్శకులతోనే ఉంటాయి. అవి రెండూ రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు కావు. కచ్ఛితంగా పవన్ బ్రాండ్ ఇమేజ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లేవి ఇవి. కల్ట్ జోనర్ లో ఎంతో స్పెషల్ గా ఉంటాయని తెలిసింది. ఓ రెండు అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు ఇద్దరు ప్రతిభావంతులైన యువ దర్శకులను పూర్తి స్క్రిప్టుల్ని రెడీ చేయాల్సిందిగా కోరాయని తెలుస్తోంది. అన్నీ సరిగ్గా జరిగితే పవన్ ఈ రెండు సినిమాల కథలకు ఓకే చెప్పేందుకు ఆస్కారం ఉంది. అయితే అంతిమంగా ఆ ఇరువురు యువదర్శకులు తమ స్క్రిప్టులతో ఒప్పించాల్సి ఉంటుంది. లైన్ వినిపించడం వేరు.. పూర్తి బౌండ్ స్క్రిప్టుతో ఒప్పించడం వేరు. అందువల్ల ఆ ఇద్దరికీ అవసరమైన టైమ్ ని ఇచ్చారని తెలిసింది.

ఇకపై ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు సంతకాలు చేస్తూ నిరంతరం బిజీగా ఉండాలన్నది పవన్ ఆలోచన. అందుకు తగ్గట్టే ప్లానింగ్ సాగుతోంది. ఏడాదికి మినిమం రెండు సినిమాలు రిలీజవ్వాలన్నది ఆయన ఆలోచన. 2021లో సెట్స్ పై ఉన్నవి పూర్తి కావడం ఆలస్యమవుతోంది. అందువల్ల 2022లో వరుసగా పవన్ సినిమాలు రిలీజవుతాయి. 2021 సంక్రాంతికి ఒక సినిమా సమ్మర్ కి ఇంకో సినిమా రిలీజయ్యేలా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

`హరి హర వీరమల్లు` పవన్ పాన్ ఇండియా మూవీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని `హరి హర వీరమల్లు` చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించేందుకు క్రిష్ హార్డ్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బంధిపోటుగా వీరుడిగా పవన్ డిఫరెంట్ షేడ్స్ తో కనిపించనున్నారు. హిస్టరీ నేపథ్యంలో ఫిక్షన్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పవన్ కి హిందీ మార్కెట్ ని పెంచుతుందని అంచనా.

భీమ్లా నాయక్ కి ఇది కలిసొచ్చే అంశం. హరిహర వీరమల్లు.. భీమ్లా నాయక్ హిందీ డబ్బింగులకు భారీగా డిమాండ్ పెరగనుంది. వీలైనంత వేగంగా రెండు సినిమాల్ని పూర్తి చేసి ఆ తర్వాత హరీష్ శంకర్ తో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. పవన్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా.. అభిమానుల్ని మెప్పించే పక్కా మాస్ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని హరీష్ ప్రామిస్ చేసారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నారు. బెస్ట్ నటీనటుల్ని..సాంకేతిక నిపుణుల ఎంపిక పనుల్లో తలమనుకలై ఉన్నారు. ఇందులో పవన్ కి జోడీగా పూజాహెగ్డేని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారుట. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ భామగా వెలిగిపోతున్న పూజాహెగ్డే అయితే సినిమాకు కలిసొస్తుందని హరీష్ భావిస్తున్నాడుట. పూజా పాన్ ఇండియా చిత్రాల్లో నటించడం ఈ సినిమాకి ప్లస్ అవుతుందని.. అందుకే భారీ పారితోషికం ఆఫర్ చేసారని తెలిసింది.


Recent Random Post: