అఖిల్ పెళ్ళెప్పుడు అని నాగ్ ను నిలదీసిన గంగవ్వ

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమైంది. నాగార్జున ఈ సినిమా ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటున్నాడు. తాజాగా గంగవ్వతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు నాగార్జున. గంగవ్వ తనదైన స్టైల్ లో నాగార్జునను ప్రశ్నలు అడుగుతుంటే నాగ్ చాలా స్పోర్టివ్ గా సమాధానాలు చెప్పాడు. సినిమా గురించి ప్రశ్నలు అడుగుతూ ఇంతకీ చైతన్య, సమంత నీకు ఎప్పుడు మనవడినో, మానవరాలినో ఇచ్చేది? అని ప్రశ్నించింది.

దానికి నాగ్ ఏమో, నేను కూడా వాళ్ళని అదే అడుగుతూ ఉంటాను. నేను కూడా తాతను అవ్వడానికి ఎదురుచూస్తున్నా అన్నాడు. మరి నీ రెండో కొడుకు పెళ్లి ఎప్పుడు అంటే ఆ నిర్ణయానికి వాడికే వదిలేసాను అని చెప్తాడు. దానికి గంగవ్వ, అలా ఎలా వదిలేస్తావు. మా ఊర్లో చూడనా? చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. నీ పెద్ద కోడలిలా కాకుండా కొంచెం కండ పట్టి ఉన్నవాళ్ళని చూసి సెలెక్ట్ చేస్తా అని గంగవ్వ అనేసింది.


Recent Random Post: