క్యారక్టర్స్ ఇంట్రో లుక్: మారుతి తరహా క్రేజీ ఫన్ రైడ్ గా ‘మంచి రోజులు వచ్చాయి’


‘ప్రతిరోజూ పండగే’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. అయితే ఈ గ్యాప్ లో సైలెంట్ గా ”మంచి రోజులు వచ్చాయి” అనే మరో చిత్రాన్ని రూపొందించారు మారుతి. ఇందులో ‘ఏక్ మినీ కథ’ ఫేమ్ సంతోష్ శోభన్ – మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రియల్ క్యారెక్టర్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ మరియు సూపర్ కూల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘మంచి రోజులు వచ్చాయి’ క్యారక్టర్స్ ఇంట్రో లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

క్యారక్టర్స్ ఇంట్రో లుక్ చూస్తుంటే మారుతి గత చిత్రాల మాదిరిగానే మరో నవ్వులు పూయించే సినిమా రాబోతున్నట్లు అర్థం అవుతోంది. సంతోష్ శోభన్ – మెహ్రీన్ తో పాటుగా స్టార్ కమెడియన్స్ అందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అజయ్ ఘోష్ – వెన్నెల కిషోర్ – శ్రీనివాస్ రెడ్డి – ప్రవీణ్ – సప్తగిరి – సుదర్శన్ – వైవా హర్ష – సత్యం రాజేష్ – శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే కరోనా విపత్కర పరిస్థితుల సమయంలో జరిగిన సంఘటనలు – అప్పుడు మనుషులు ఎలా ప్రవర్తించారు అనే అంశాలను ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రంలో ఫన్నీగా చూపిస్తున్నారని తెలుస్తోంది.

‘మీరు భయానికి భయపడి ఎంత దూరం పారిపోతే అది మీకు అంత దగ్గర అవుతుంది.. ఆయన మీకు అంత దూరం అవుతారు’ అని సంతోష్ డైలాగ్ చెప్పే విధానం కొత్తగా ఉంది. సంతోష్ ని ఉద్దేశిస్తూ వైవా హర్ష చెప్పే ‘నువ్వు చేసిన రెండు సినిమాలకే ఇంత ఎక్సపీరియన్స్ ఏంటి బావా’ అనే డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. మారుతి స్టైల్ లో ఫన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది. మొత్తం మీద క్యారక్టర్స్ ఇంట్రో లుక్ వీడియోని బట్టి ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రంలో నవ్వులకు కొదవ లేదనేది అర్థం అవుతుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

UV కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వి సెల్యులాయిడ్ మరియు SKN నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ఏక్ మినీ కథ’ లాంటి హిట్ అందించిన యూవీ కాన్సెప్ట్స్ తో యువ హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాతో మరోసారి జత కడుతున్నాడు. మారుతి – యూవీ సంస్ధ – SKN కాంబినేషన్ లోని వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ‘మంచి రోజులు వచ్చాయి’ కూడా మంచి సక్సెస్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Recent Random Post: