దసరాకు జక్కన్న మహేష్ మూవీ ప్రకటన!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి బాహుబలి తర్వాత మహేష్ బాబుతో సినిమా అనుకున్నాడు. కాని కొన్ని కారణాల వల్ల మహేష్ తో కాకుండా ఎన్టీఆర్ మరియు చరణ్ లతో ఆర్‌ఆర్ఆర్‌ సినిమాను పట్టాలెక్కించాల్సి వచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తదుపరి సినిమా ఖచ్చితంగా మహేష్‌ బాబుతో ఉంటుందని చెప్పుకొచ్చాడు. దాంతో ఆ క్రేజీ కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా గురించిన ఒక అప్ డేట్‌ వచ్చింది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కాని ఈ దసరాకు వీరి కాంబో మూవీ అధికారికంగా ప్రకటన రాబోతుందట.

రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా అక్టోబర్‌ లో విడుదల కాబోతుంది. కనుక అదే సమయంలో మహేష్‌ బాబుతో సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉంటాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను జక్కన్న తీస్తాడని ఇప్పటి నుండే జనాల్లో ఆసక్తి కనిపిస్తుంది. రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబును చత్రపతి శివాజీ గా చూపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. గత చిత్రాల మాదిరిగా కాకుండా కేవలం ఏడాదిన్నర లేదా రెండేళ్లలోనే మహేష్‌ తో సినిమాను పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. అన్ని విషయాలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Recent Random Post: