ఉప రాష్ట్రపతిని కలిసిన హీరో విశాల్‌

తమిళ యంగ్‌ హీరో విశాల్‌ తాజాగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. ఈ సందర్బంగా ఆయనతో పలు విషయాల గురించి మాట్లాడినట్లుగా విశాల్‌ తెలియజేశాడు. విశాల్ తమిళ నటుడు అయినా కూడా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి అనే విషయం తెల్సిందే. ఇక ఉప రాష్ట్ర పతి కూడా తెలుగు వ్యక్తి అనే విషయం అందరికి తెల్సిందే. అలా ఇద్దరి మద్య భేటీ జరిగిందా లేదా మరేదైనా ప్రత్యేక కారణం ఉందా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తమిళంలో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విశాల్ త్వరలో రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. అందులో మొదటిది డిటెక్టివ్ కు సీక్వెల్‌. తెలుగు లో కూడా ఈయన సినిమాలు బాగా ఆడుతు ఉంటాయి. కనుక ఈయన నటించిన ప్రతి సినిమాను డబ్‌ చేస్తున్నారు. కొన్ని సినిమాలను అక్కడ ఇక్కడ కూడా తెరకెక్కిస్తూ ఉంటారు. ఇక ఉప రాష్ట్రపతిని కలవడం పట్ల విశాల్‌ సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఆయన గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు.


Recent Random Post: