డెలవరీ ఎలా? పాలు ఎలా ఇస్తున్నారు.. హరితేజ సూపర్‌ రిప్లై

బుల్లి తెరపై మంచి గుర్తింపు దక్కించుకున్న హరితేజ ఇటీవలే పాపకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. తాను డెలవరీ సమయంలో పడ్డ ఇబ్బందుల గురించి చెప్పి కంట తడి పెట్టించింది. ఆ సమయంలో తన పక్కన ఎవరు లేరని తాను కరోనా పాజిటివ్‌ అంటూ చెప్పడంతో అంతా కూడా అయ్యో అంటూ నిట్టూర్చారు. ఆమె ఎప్పటిలాగే మళ్లీ సోషల్ మీడియాలో బిజీ అయ్యింది. తాజాగా అభిమానులతో లైవ్‌ చాట్‌ చేసింది. ఆ సమయంలో ఆమెకు వింత విత ప్రశ్నలు ఎదురు అయ్యాయి.

హరితేజను మీది నార్మల్ డెలవరీ నా లేదంటే సిజరీయన్‌ అయ్యిందా అంటూ ప్రశ్నించారు. దానికి ఏదోలా అయితే డెలవరీ అయ్యిందని అంటూ తెలివిగా సమాధానం చెప్పింది. ఇక ఒకరు మీరు ఫీడింగ్‌ చేస్తున్నారా లేదా బాటిల్‌ అంటూ ప్రశ్నించగా ఏంటో మీ అనుమానాలు అంటూ ఫన్నీ ఎక్స్‌ ప్రెషన్‌ ఇచ్చింది. ఇక వ్యాక్సిన్‌ వేయించుకున్నారా అంటూ ప్రశ్నించగా ఇంకా లేదు.. వ్యాక్సిన్ వేయించుకుంటే ఫీడింగ్‌ చేయకూడదని తీసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.


Recent Random Post: