జాతిరత్నాలు దర్శకుడి రెండవ సినిమా ఖరారు

నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందిన జాతి రత్నాలు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అనుదీప్‌ కు మంచి మార్కులు పడ్డాయి. జాతి రత్నాలు సినిమా ఒక ట్రెండ్‌ ను సృష్టించింది. అలాంటి ట్రెండీ మూవీని తెరకెక్కించిన దర్శకుడు అనుదీప్‌ ప్రస్తుతం రెండవ సినిమాను తమిళ హీరో శివ కార్తికేయన్‌ తో చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటకే ఈయన కథ ను సిద్దం చేయడంతో పాటు శివ కార్తికేయన్‌ ను ఒప్పించాడట. దాంతో సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.

నేడు అధికారికంగా ఈ సినిమా ను అనౌన్స్‌ చేయబోతున్నారు. SVCLLP బ్యానర్ లో నారాయన్‌ దాస్‌ నారంగ్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. తెలుగు లో నే కాకుండా ఈ సినిమా హిందీ, తమిళం మరియు మలయాళంలో కూడా విడుదల కాబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. శివ కార్తికేయన్‌ మొదటి తెలుగు సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అనుదీప్ మొన్నటి వరకు జాతిరత్నాలు సీక్వెల్‌ కోసం వర్క్‌ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు ఉన్నట్లుండి శివ కార్తికేయన్‌ తో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటన వచ్చి ఆశ్చర్యపర్చింది.


Recent Random Post: