ఏ పంట వేసుకుంటారో మీ ఇష్టం.. నియంత్రత్వ సాగుకు స్వస్తి: సీఎం కేసీఆర్

తెలంగాణ లో తొలి నుంచీ వివాదాస్పదం అయిన నియంత్రిత సాగుపై కేసీఆర్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పంట కొనుగోలు ద్వార 7,500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నియంత్రిత సాగు ఇకపై తెలంగాణలో ఉండదని.. రైతులు ఏ పంట పండించుకుంటారో వారి ఇష్టం అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో పంట కొనుగోళ్లు, ఇతర సాగు అంశాలపై జరిపిన సమీక్షలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయం చట్టాలపై స్పందించారు. రైతులు తమ పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నియంత్రిత సాగు విధానంపై విపక్షాలు, రైతుల సంఘాలే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈనెల 28 (సోమవారం) నుంచి రైతుబంధు పథకం అమలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులకు ఎకరాకు 5వేల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తంగా 7,515 కోట్లు పంట సాయం అందించనున్నారు.


Recent Random Post: