మెగాస్టార్ ఇంట వెటరన్ నటి ఖుష్ఫూ!

మెగాస్టార్ చిరంజీవికి సమకాలీకుల్ని కలవడం అంటే ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఆయనతో కలిసి నటించిన నటీనటులు..ముఖ్యంగా మేటి హీరోయిన్లు తో గెట్ టూ గెదర్ పార్టీలంటే అస్సలు మిస్ అవ్వరు. చెన్నై లోగానీ..హైదరాబాద్ లో గానీ ఏడాదికి ఒక్కసారైనా కలుస్తుంటారు. హైదరాబాద్ లో అయితే నేరుగా చిరంజీవినే ఆతిధ్యం ఇస్తారు.

ఆయన ఇంట్లోనే అంతా కలుస్తారు. పార్టీ చేసుకుని అందరూ తలో స్టెప్ ని చిరంజీవితో పంచుకుంటారు. ఇక వ్యక్తిగతంగా చిరంజీవితో స్నేహ పూర్వకంగా కలవాలంటే నేరుగా ఇంటికే ఆహ్వానిస్తారు. ఆ పూట అక్కడ భోజనం ఏర్పాట్లు చేస్తారు. టాలీవుడ్ లో ఈరకమైన కల్చర్ చిరంజీవితో పాటు నాగార్జున ఇంట్లోనూ చోటు చేసుకుంటుంది.

సుహాసిని..రాధ…తులసి ఇలా చిరు..నాగార్జున సరసన నటించిన మేటి నాయికలంతా ఎప్పడూ టచ్ లో ఉంటారు. తాజాగా వెటరన్ నటి ఖుష్పూ-చిరంజీవిని ఆయన ఇంటికెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఓ వీడియోని ఖష్ఫూ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. “లెజెండ్ చిరంజీవిగారిని ఎప్పుడు కలిసినా చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబం.. స్నేహం..మరెన్నో ఇతర విషయాలను ఆయనతో షేర్ చేసుకున్నాను. చిరంజీవి గొప్ప వ్యక్తి.. అద్భుతమైన స్నేహితుడు` అని ట్విట్టర్లో రాసుకొచ్చారు.

ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇద్దరు జటంగా నటిచంని పాత చిత్రాల్ని స్మరించుకుంటూ ఎంత అందంగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఇది స్నేహపూర్వక భేటినా ? లేక ఇకేమైనా కారణాలు ఉన్నాయా? అన్నది తెలియాలి. ఖుష్బూ సెకెండ్ ఇన్నింగ్స్ కూడా హ్యాపీగా సాగిపోతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరోల చిత్రాల్లో మామ్ పాత్రలు..సిస్టర్ పాత్రలు పోషిస్తున్నారు. ఇక కోలీవుడ్ లోనూ ఇదే పంథాలో ముందుకు సాగుతున్నారు. నటిగా ఎప్పుడు బీజీగానే ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ గా కన్నా మరింత బిజీ అయ్యారని చెప్పొచ్చు. 2006లో చిరంజీవి హీరోగా విడుదలైన `స్టాలిన్` సినిమాలో ఖుష్బూ ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అప్పట్లో హీరోయిన్ గా ..ఆ తర్వాత చిరు సిస్టర్ పాత్రలోనూ కనిపించడం ప్రేక్షకులికి కొత్త ఫీల్ ని అందించింది. ఇక చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. `ఆచార్య` త్వరలో రిలీజ్ కానుంది.` గాడ్ ఫాదర్`..`బోళా శంకర్`..`వాల్తేరు వీరన్న` లాంటి సినిమాలు సెట్స్ లో ఉన్నాయి.


Recent Random Post: