కూలీ కొడుకు ప్రైజ్ మనీని మింగేసిన యాంకర్‌ ఓంకార్‌

తెలుగు బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంతరించుకున్న యాంకర్‌ ఓంకార్‌. ఈయన తెలుగు ప్రేక్షకులకు రియాల్టీ షో లను పరిచయం చేయడం జరిగింది. రియాల్టీ షో ల్లో డ్రామాను మొదట ఓంకార్ తీసుకు వచ్చాడు. ఓంకార్‌ షో ల తర్వాత మొత్తం తెలుగు బుల్లి తెర పరిశ్రమలో మార్పులు వచ్చాయి అనడంలో సందేహం లేదు. బుల్లి తెరపై ఆయన చేసిన ఎన్నో షో లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కాని బుల్లి తెరపై ఆయన కు ఎంత పేరు వచ్చిందో అంత నెగటివిటీ కూడా వచ్చింది. షో లను అనవసరంగా వివాదాస్పదం చేసి రేటింగ్‌ కోసం ప్రయత్నిస్తాడంటూ ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా ఆట డాన్స్ షో విన్నర్‌ సన్నీ మాస్టర్‌ ఒక ఇంటర్వ్యూలో షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. ఆట సీజన్‌ 6 లో ఒక రైల్వే కూలీ కొడుకు సీజన్ విన్నర్‌ గా నిలిచాడు. లక్ష రూపాయల ప్రైజ్ మనీని ఇవ్వాలని మొదటే నిర్ణయించారు. కాని ఇప్పటి వరకు ఆ ప్రైజ్ మనీ ఇవ్వలేదు. ఆ ప్రైజ్ మనీని ఓంకార్ తీసుకున్నాడు అంటూ సన్నీ ఆరోపించాడు. ఇంటర్వ్యూలో సన్నీ మరిన్ని షాకింగ్‌ విషయాలను వెళ్లడించాడు. ఆట షో లో విజేతలకు మొండి చేయి చూపించారని జీ తెలుగు వారు ప్రైజ్ మనీ ఇచ్చినా కూడా ఓంకార్‌ ఇవ్వలేదు అంటూ సన్నీ ఆరోపించాడు.


Recent Random Post: