కేరళ ఫ్యాన్స్ వల్లే గౌరవం పెరిగింది : బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `పుష్ప : ది రైజ్`. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే అందులో ఫస్ట్ పార్ట్ గా .`పుష్ప : ది రైజ్` ఈ 17న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గత కొన్ని రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించారు. చిత్ర బృందం తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో చిత్రాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా ఇటీవల కన్నడ మీడియాతో ఇంటరాక్ట్ అయిన బన్నీ ఆ వెంటనే తన టీమ్ తో కేరళకు చేరుకున్నారు. మలయాళ ప్రేక్షకుల్లో బన్నీకి ప్రత్యేకమైన స్థానం వున్న విషయం తెలిసిందే. దీంతో బన్నీ కూడా కేరళ ప్రెస్ మీట్ ని ప్రత్యేకంగా భావించారు. ఇక్కడ బన్నీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరో అల్లు అర్జున్ ఓ ఆసక్తికరమైన అంశాన్ని బయటపెట్టడం ఆసక్తికరంగా మారింది.

`కేరళలో తనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడిన తరువాత నుంచి తనని తెలుగు ఇండస్ట్రీ వర్గాలు ప్రత్యేకంగా చూడటం మొదలుపెట్టాయి. మలయాళ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న తరువాతే నాకు తెలుగు ఇండస్ట్రీలో గౌరవం పెరిగింది. ఈ సందర్భంగా నా అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతే కాకుండా కొంత మంది తెలుగు నటులు నా చిత్రాల కారణంగా.. నా అభిమానులు కారణంగానే ఇక్కడ మాకు గుర్తింపు లభిస్తోందని చెప్పారు` అని బన్నీ మలయాళ అభిమానుల్ని బుట్టలో పడేసి వారికి ఏ స్థాయిలో తను ప్రధాన్యతనిన్నాడో స్పష్టం చేసే ప్రయత్నం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఏది ఏమైనా బన్నీకి కేరళలో ఫ్యాన్ బేస్ ఏర్పడటం తెలుగు ప్రేక్షకులు అభిమానులు గరవంగా ఫీలవుతున్నారన్నది వాస్తవం. కేరళలో హ్యూజ్ క్రేజ్ ని దక్కించుకున్న మొట్టమొదటి స్టార్ గా బన్నీ రికార్డు సాధించాడు. అయితే ఈ ఫ్యాన్ బేస్ కారణంగానే అతనికి టాలీవుడ్ లో గౌరవం దక్కుతోందన్నది మాత్రం ఎవరూ అంగీకరించరు.


Recent Random Post: