స్టార్‌ హీరోకు కరోనా పాజిటివ్‌

కరోనా వల్ల ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అయ్యింది. గత ఏడాది ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. అయితే గత కొన్ని నెలలుగా సినీ ప్రముఖుల కరోనా గురించి ఎక్కువగా వార్తలు రావడం లేదు. కరోనా కేసులు కూడా తగ్గిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తమిళ స్టార్‌ హీరో సూర్య కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఆయన ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు.

మన జీవితాల నుండి ఇంకా కరోనా బయటకు వెళ్లి పోలేదు. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం నేను కరోనా నుండి కోలుకుంటున్నాను. నాకు ఈ సమయంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ సూర్య సోషల్‌ మీడియా ట్వీట్ చేశాడు. సౌత్ ఇండియాలో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న స్టార్‌ హీరోల్లో సూర్య ఒకరు. ఆయన కరోనా బారిన పడ్డట్లుగా వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా కరోనా ఉంది కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఇండస్ట్రీ వర్గాల వారికి కూడా ఇది ఒక సందేశంగా ఉంది.


Recent Random Post: