‘మళ్ళీ పెళ్లా.. బుద్ధిలేదా..?’ సుమంత్ పై వర్మ అటాక్

ప్రపంచంలో తనకు సంబంధం లేని విషయమంటూ లేదని తన ట్వీట్స్ ద్వారా చెప్పే అర్జీవీ మరోసారి కొత్త ట్వీట్ తో ముందుకొచ్చాడు. ఈసారి అక్కినేని కుటుంబ హీరో సుమంత్ ని టార్గెట్ చేశారు. దశాబ్దం క్రితమే హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకుని తర్వాత విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. ఇన్నేళ్లకు సుమంత్ మళ్ళీ పెళ్లి చేసుకోబుతున్నాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో వర్మ తనదైన స్టయిల్లో స్పందించాడు.

“ఓసారి పెళ్ళయ్యాక కూడా నీకింకా బుద్ది రాలేదా సుమంత్? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ.. అనుభవించండి” అంటూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు వర్మ. మరో ట్వీట్ లో.. “ఒక పెళ్లి నూరేళ్ళ పెంట అయితే.. రెండో పెళ్లేంటయ్యా స్వామీ? నా మాట విని మానెయ్యి. పవిత్ర గారూ మీ జీవితాలను పాడు చేసుకోకండి. తప్పు మీది, సుమంత్ ది కాదు. తప్పు ఆ దౌర్భాగ్య వ్యవస్థది” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది.

గతంలో కీర్తిరెడ్డితో పెళ్లి అయిన రెండేళ్లకే వారు విడాకులు తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ళు ఒంటరిగా ఉన్న సుమంత్ ఇప్పుడు పెళ్ళాడబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో.. స్వతహాగా పెళ్లికి వ్యతిరేకి అయిన వర్మ ఈ విధంగా స్పందించారు. తన దర్శకత్వంలోనే ప్రేమకథ ద్వారా సుమంత్ ను హీరోగా లాంచ్ చేశారు.


Recent Random Post: