స్కంద కోసం చివరగా రామ్, శ్రీలీల.. ఇలా..

రామ్ పోతినేని, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా స్కంద. ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం షూటింగ్ మొత్తం పూర్తి చేయడం విశేషం. చివరగా, ఒక సాంగ్ మిగిలి ఉండగా, దాని కోసం రామ్ పోతినేని, శ్రీలీల డ్యాన్స్ వేశారు. షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఈ ఫోటో ప్రస్తుుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో రామ్, శ్రీలలతో పాటు డైరెక్టర్ బోయపాటి, నిర్మాత శ్రీనివాస చిట్టూరి కూడా ఉన్నారు. రామ్ ఆల్ట్రాలుక్ లో దర్శనమివ్వగా, శ్రీలల అందంగా కనపడుతోంది. ఈ మూవీ షూటింగ్ లో ఇదే చివరి సాంగ్ అని తెలుస్తోంది. ఆ ఫోటో బ్యాగ్రౌండ్ లో సాంగ్ సెట్ కనపడుతోంది. అది మాత్రం చాలా కలర్ ఫుల్ గా ఉంది. ఇక, ఇప్పటికే ఈ మూవీ నుంచి నీ చుట్టూ చుట్టూ అనే సాంగ్ విడుదల చేయగా, అభిమానులను ఆకట్టుకుంది.

త్వరలోనే రెండో సింగిల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మూవీ గ్లింప్స్ విడుదల చేయగా, సూపర్ గా క్లిక్ అయ్యింది. అఖండ మూవీ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా ఇది. దీంతో, సహజంగానే ఈ మూవీ అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే ట్రైలర్ ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. మొదట ఈ మూవీని అక్టోబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ప్రీ పోన్ కావడం విశేషం. కామన్‌గా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి షూటింగ్స్ లేట్ వంటి కారణాల వల్ల రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ చేస్తారు. కానీ రామ్, బోయపాటి చిత్రం మాత్రం అనుకున్న తేదీ కంటే ముందే వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా, రామ్ చివరగా వారియర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ డిజాస్టర్ గా మారింది. దీంతో, రామ్ ఆశలన్నీ ఈ మూవీపైనే ఉన్నాయి. మరి ఈ మూవీతో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.


Recent Random Post: