మెగాస్టార్-మెగా ప‌వ‌ర్ స్టార్ 2024-25?

మెగాస్టార్ చిరంజీవి -మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానుల్ని అల‌రించేది 2024 ముగింపులోనేనా? అలా సాధ్యంకాని ప‌క్షంలో 2025లోనే సాధ్య‌మ‌వుతుందా? తాజా స‌న్నివేశం నేప‌థ్యంలో తండ్రీ-కొడుకులు కూడా డైల‌మాలో ప‌డ్డారా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది. చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘గేమ్ ఛేంజ‌ర్’ పై ఎలాంటి నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయో క‌నిపిస్తున్న‌దే. గ‌త ఏడాదే మొద‌లైన సినిమా 2023 లో రిలీజ్ ఖాయ‌మ‌నుకున్నారు. కానీ అది జ‌రిగే ప‌ని కాద‌ని తేలిపోయింది.

మ‌రి 2024 లోనైనా రిలీజ్ అవుతుందా? అంటే అదీ సందేహంగానే క‌నిపిస్తోంది. 2024 లో సాధ్యంకాక‌పోతే 2025లోనే అభిమానుల్ని అల‌రించేది అన్న‌ది మ‌రో వాద‌న‌. గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలో అస‌లేం జరుగుతుందో అర్దంకాని స‌న్నివేశం క‌నిపిస్తుంది. చివ‌రికి చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా రిలీజ్ కి వ‌చ్చిన‌ప్పుడు చూసుకుందాం లే! అప్ప‌టివ‌ర‌కూ ఆ డిస్క‌ష‌న్ అన‌వ‌స‌ర‌మైంది అన్న‌ట్లుగానే ఓ సంద‌ర్భంలో వ్యాఖ్యానించారు. దీంతో మెగా అభిమానుల్లో నిరుత్సాహం రెట్టింపు అయింది.

అప్ప‌టివ‌ర‌కూ 2033 లోసాధ్యం కాక‌పోతే 2024 ఆరంభంలోనైనా వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉండేది. కానీ రాజుగారు వ్యాఖ్య‌లు..తాజా స‌న్నివేశం చేస్తుంటే అదైనా జ‌రుగుతందా? అన్న కొత్త డౌట్ మొద‌లైంది. ఇప్ప‌టివ‌ర‌కూ సినిమా షూటింగ్ ఎంత వ‌ర‌కూ పూర్త‌యిందో స‌రైన క్లారిటీ లేదు. ప్ర‌స్తుతానికి షూటింగ్ జ‌ర‌గ‌లేదు. తిరిగి ఎప్పుడు పున‌ప్రారంభమ‌వుతుందో కూడా తెలియ‌న స‌న్నివేశం క‌నిపిస్తోంది.

ఇలా ఇన్ని ర‌కాల సందేహాల్లో ‘గేమ్ ఛేంజ‌ర్’ క‌నిపిస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా విష‌యంలో క్లారిటీ లేదు. ఇప్ప‌టికిప్పుడు మ‌ళ్లీ క‌థ‌లో మార్పులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఓ వైపు క‌ల్యాణ్ కృష్ణ శ్ర‌మిస్తున్నా! చిరు క‌న్విన్స్ కావ‌డం లేద‌ని వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే 157 ని ముందుకు తీసుకొచ్చారు. ఇది సోషియా ఫాంట‌సీ చిత్రం కావ‌డంతో ఈ సినిమా కూడా 2024 లో రిలీజ్ అయ్యే అవ‌కాశం లేదంటున్నారు. సినిమా షూటింగ్ డిసెంబ‌ర్ లో ప్రారంభం అవుతుంది. అటుపై చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్తిచేయ‌డానికి 2024 పూర్త‌వుతుంద‌న్న‌ది తాజా అప్ డేట్. ఇదే నిజ‌మైతే అన్న‌య్య కూడా అల‌రించేది 2025 లోనే.


Recent Random Post: