ఫ్యామిలీ తో బ‌న్నీ.. చిల్డ్ర‌న్స్ డే ఇలా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్ లు లేక‌పోతే ఇల్లే ప్ర‌పంచం. అర్హ..ఆయాన్ తో ఆడుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటాడు. ముఖ్యంగా అర్హ‌చేసే అల్ల‌రికి బ‌న్నీ తెగ మురిసి పోతుంటాడు. కుమార్తెతో పాటు తాను కూడా చిన్న పిల్లాడిలా మారిపోతుంటాడు. ఆ మూవ్ మెంట్స్ ని స్నేహ క్యాప్చ‌ర్ చేసి అభిమానులు షేర్ చేస్తుం టారు. ఖాళీ ఉంటే వెకేష‌న్ల‌కు వెళ్ల‌డం క‌న్నా కుటుంబంతో ఇంట్లో ఉంటేనే ఎంతో సంతోషంగా ఉంటుంద ని బ‌న్నీ చెబుతుంటాడు.

తాజాగా నేడు (న‌వంబ‌ర్ 14) చిల్డ్ర‌న్స్ డే ని పుర‌స్క‌రించుకున్న బ‌న్నీ-స్నేహాల జోడీ ఓ ఇంట్రెస్టింగ్ పిక్ ని ట్విట‌ర్లో షేర్ చేసారు. ఇందులో బ‌న్నీ కుమారుడు ఆయాన్ కి ముద్దు పెడుతున్న స‌న్నివేశాన్ని చూడొచ్చు. తండ్రీ కొడుకులిద్ద‌రు ఒకే రంగు డిజైన్ తో కూడిన కోట్ లో క‌నిపిస్తున్నారు. న‌ల్ల రంగు కోటు..న‌ల్ట బూట్లు వేసుకున్నారు. సోపై లో ఉన్న కుమారుడిని హ‌త్తుకుని బ‌న్నీ ప్రేమ‌ను చాటుతున్నాడు. ఇక కుమార్తె అర్హ అమ్మ ఒడిలో వాలిపోయింది.

స్నేహ డాట‌ర్ ని ఈ వేడుక సంద‌ర్భంగా బుట్ట‌బొమ్మ‌లా ముస్తాబు చేసారు. జూలు డిజైన్ తో కూడిన గౌన్ లో అర్హ క్యూట్ గా క‌నిపిస్తుంది. అలాగే స్నేహ కూడా బ్యూటీగా ముస్తాబ‌య్యారు. డిజైన‌ర్ దుస్తుల్లో ఆక‌ర్ష ణీయంగా క‌నిపిస్తున్నారు. హ్యాపీ చిల్డ్ర‌న్స్ డే అంటూ ఈవేడుక‌ను బ‌న్నీ అండ్ ఫ్యామిలీ సెల‌బ్రేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ గా మారింది. పిల్ల‌లు క‌ల తల్లిదండ్రుల‌తో న‌వంబ‌ర్ 14ని ఎంతో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంటారు.

పిల్ల‌ల‌కు ఇష్ట‌మైన రోజు ఇది. అందుకే బ‌న్నీ-స్నేహ దంప‌తులు ఇలా ఔటింగ్ కి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బ‌న్నీ క‌థానాయ‌కుడిగా `పుష్ప‌-2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌ల పాటు నిర్విరామంగా షూటింగ్ జ‌ర‌గ‌డంతో బ‌న్నీ కి క్ష‌ణం తీరిక లేదు. ఈ మ‌ధ్య కాస్త గ్యాప్ దొరుకుతుంది. అందుకే ఇలా కుటుంబానికి కావాల్సినంత స‌మ‌యాన్ని కేటాయించ‌గ‌ల్గుతున్నాడు.


Recent Random Post: