ఫోటో స్టోరీ : దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా..!

వెండితెర మీద కథానాయికగా మెరవాలని చాలామంది గొప్ప ఆశలతో పరిశ్రమకు వస్తారు. అయితే అలా వచ్చిన వారిలో కొందరు అతి తక్కువ టైం లోనే మంచి అవకాశాలు వచ్చి గుర్తుంపు రాగా.. మరికొందరికి మాత్రం ఒక మోస్తారు గుర్తింపు తెచ్చుకోవడానికి ఏళ్లు టైం తీసుకుంటుంది. అల టైం ఎక్కువ తీసుకున్నా సరే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది దివి వాద్య. మోడల్ గా చేస్తూ సినిమాల్లో పెద్దగా గుర్తుంపు లేని.. వెనక మందలో ఒకరిగా చేస్తూ వచ్చిన దివి తన ఫోకస్ ఏమాత్రం మిస్ అవకుండా ప్రయత్నించింది.

ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఛాన్స్ కూడా ఆమెకు లక్కీ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 4 లో దివి వాద్య తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించింది. హౌస్ లో కేవలం ఐదారు వారలే ఉన్నా దివి మాత్రం తన మార్క్ ఏర్పాటు చేసుకుంది. బిగ్ బాస్ తర్వాత దివికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తోనే ఆమె వరుసగా అవకాశాలు అందుకుంటుంది.

ముఖ్యంగా బిగ్ బాస్ కి వెళ్లేముందు కేవలం 20 వేల ఫాలోవర్స్ మాత్రమే ఉండగా ఆఫ్టర్ బిగ్ బాస్ అమ్మడికి 1 మిలియన్ కి దగ్గరగా ఫాలోవర్స్ వచ్చారు. మహేష్ మహర్షి సినిమాలో మెరుపుతీగలా కనిపించిన దివి సందీప్ కిష ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించింది.

క్యాబ్ స్టోరీస్ అంటూ ఓ ప్రైవేట్ ఆల్బంతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది దివి. రీసెంట్ రిలీజ్ మెగా గాడ్ ఫాదర్ లో కూడా ఒక మంచి పాత్రలో కనిపించి అలరించింది దివి వాద్య. అయితే సినిమాలు.. వెబ్ సీరీస్ లతో పాటుగా సోషల్ మీడియా ఫాలోవర్స్ హార్ట్ బీట్ పెంచేందుకు అమ్మడు తన హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.

లేటెస్ట్ గా థైస్ షోస్ చేస్తూ దివి షేర్ చేసిన ఈ ఫోటోలు చూస్తే దివి నుంచి వచ్చిన దేవ కన్యా ఈమె అని అనక తప్పదు. సోషల్ మీడియా క్రే తోనే ఆమె తన అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని చూస్తుంది దివి వాద్య.

ప్రస్తుతం దివి సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో వస్తున్న సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. ఇదేకాకుండా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా ఆమెకి ఛాన్స్ ఇచ్చారట. మెగా బూస్టింగ్ తో అమ్మడు కెరియర్ లో సెటిల్ అయిపోవాలని చూస్తుంది. అయితే సోలో హీరోయిన్ గా వస్తే మాత్రం ఎలాంటి కథ అయినా ఓకే చెప్పేందుకు రెడీ అంటుంది దివి వాద్య.


Recent Random Post: