పవన్ కళ్యాణ్ కు మెగా అండదండలు.. ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా

ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉత్కంఠంగా మారుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఫలితాలు తారుమారు అవుతాయి అనే విధంగా కూడా కామెంట్ వస్తూ ఉన్నాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తప్పకుండా గెలవాలి అని ఆయన కుటుంబ సభ్యులు ఏ స్థాయిలో కోరుకుంటున్నారో ఈపాటికే అర్థమయింది.

చిరంజీవి తన తమ్ముడికి సపోర్టు ఇచ్చినప్పటికీ పాలిటిక్స్ అనే అంశానికి ఆయన కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తల్లి సురేఖ తో కలిసి పవన్ ను పిఠాపురంలో ప్రత్యేకంగా కలుసుకున్నారు. వీరితో పాటు అల్లు అర్జున్ కూడా తన బెస్ట్ విషెస్ ను అందించారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆమె గతంలో పార్టీ కోసం సహాయం కూడా చేశారు. ఇక అల్లు అరవింద్ కూడా సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫ్యామిలీ మొత్తం కూడా పవన్ వైపు నిలబడినట్లుగా అర్థమవుతుంది.

ఇక పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ కనిపించడంతో ఆ ఫోటోలు కూడా ఫ్యాన్స్ కు మంచి కిక్ అయితే ఇస్తున్నాయి. అయితే ఒక ఫొటోలో పవన్ కళ్యాణ్ కాలికి కాస్త గాయం అయినట్లు కూడా అనిపిస్తుంది. ఒక ఫోటోలో పవన్ కాలికి కట్టు కట్టినట్లు ఉంది. అయితే ఎక్కడ పవన్ దాన్ని హైలెట్ చేసుకోలేదు. మొత్తానికి పవన్ కు మెగా ఫ్యామిలీ నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. మరి ఈ ప్రభావం రాజకీయంగా ఆయనకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

Recent Random Post: