దేశంలో బెస్ట్‌ సీఎంల జాబిత.. జగన్ నెంబర్ ఎంతో తెలుసా?

దేశంలోనే ప్రముఖ మీడియా సంస్థ అయిన ఏబీపీ న్యూస్‌ సంస్థ ప్రముఖ సర్వే సంస్థ సీ ఓటర్‌ తో కలిసి దేశ్‌ కా మూడ్ అనే సర్వేను నిర్వహించడం జరిగింది. ఆసర్వేలో భాగంగా దేశంలోని టాప్ ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేసింది. అందులో దేశంలోనే నెం.1 సీఎంగా ఒడిస్సా సీఎం నవీన్‌ పట్నాయక్ నిలిచారు. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ లు ఉన్నారు. వీరిద్దరు కూడా వారి వారి రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకుని ప్రజల మన్ననలు పొందారు. ఇక మూడవ స్థానంలో ఏపీ సీఎం జగన్ ఉన్నారు.

ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ప్రవేశ పెడుతున్న కార్యక్రమాలు ఇతర్రత పథకాల కారణంగా ప్రజలు ఆయన్ను ఇష్టపడుతున్నారు. దేశంలోనే అత్యున్నత ముఖ్యమంత్రుల జాబితాలో సీఎం జగన్‌ మూడవ స్థానంలో ఉండటంపై అభిమానులు మరియు వైకాపా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 30 వేలకు పైగా ఓటర్లను ప్రశ్నించి ఈ సర్వే రిపోర్ట్‌ ను రూపొందించారు. టాప్ 10 లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. బీజేపీ ముఖ్యమంత్రులు టాప్‌ 5 లో ఒక్కరు కూడా లేరు. ఇక కేంద్రం పని తీరుపై జనాలు పాజిటివ్‌ గా ఉన్నారు. 66 శాతం మంది మోడీ ప్రధానిగా ఉండటం పట్ల పాజిటివ్ గా ఉన్నారు.


Recent Random Post: