నరసాపురంలో జగన్ కి అండ ఏంటి?

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి సంబంధించి.. ఒక కీలకమైనచర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ చర్చ ఏపీలోనే కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లో జరుగుతుండడం ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారు గెలుస్తుందా? ఓడుతుందా? అని పొరుగు రాష్ట్రాల్లోని నేతలు చర్చించుకుంటున్నారు. గెలుస్తుందని కొందరు అంటుంటే.. కష్టమని మరికొందరు చెబుతున్నారు.

ఈ క్రమంలో గెలిచే వారు చెబుతున్న కారణం.. జగన్ ఇమేజ్ అని చెబుతున్నారు. అదేవిధంగా పథకాల పరంపర కూడా పార్టీని గెలిపిస్తుందని.. వీరు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఈ చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయ నేతలు.. ఏపీలో జగన్ ప్రభుత్వం రావాలని కోరుకున్నారనే వాదన వినిపించింది. అంతేకాదు.. ఎక్కువ మంది నాయకులు జగన్ సర్కారు ఏర్పాటు కోసం.. తమ వంతు సాయం చేశారనే టాక్ కూడా వినిపించింది.

వీరంతా మరోసారి జగన్ సర్కారు రావాలని.. కావాలనే కోరుతున్నారు. ఈ క్రమంలోనే అసలు వైసీపీ మరోసారి విజయం దక్కించుకుంటుందా? లేదా? అనే చర్చ సాగుతుండడం గమనార్హం. ప్రస్తుతం వైసీపీ సర్కారు అమలు చేస్తున్న పథకాలు.. అన్ని వర్గాలకు అందుతున్నాయి. అంతేకాదు.. పోరుగు రాష్ట్రాల్లోని వారుకూడా ఈ పథకాలు అందుకుంటున్నారు.

దీంతో ఈ పథకాల పరంపర.. ఖచ్చితంగా పార్టీని మరోసారి గెలిపిస్తుందనే అంచనాలు వున్నాయి. ఇదే విషయం పొరుగు రాష్ట్రాల్లోనూ చర్చగా మారింది. అదే సమయంలో జగన్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ లే చేస్తున్నాయని.. గతంలో ఎన్నికలకు ముందు ఎలాంటి విమర్శలు గుప్పించాయో.. ఇప్పుడు కూడా అవే విమర్శలు.. చేస్తున్నారని అంటున్నారు.

కాబట్టి.. జగన్ ఇమేజ్కు వచ్చిన ఢోకా ఏమీ లేదని అంటున్నారు. అయితే.. కొన్ని నిర్ణయాల విషయంలో జగన్ సర్దుబాటు చేసుకుంటే.. ఇమేజ్ మరింత పెరుగుతుందని అంటున్నారు. వాటిలో ప్రధానంగా.. పెట్రోల్ ధరలు.. నిత్యవసరాల ధరలను తగ్గించడం కీలకమని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.


Recent Random Post: