లీడర్ వర్సెస్ సీఎం: వైఎస్ జగన్ వింత వాదన.!

‘లీడర్ అంటే అక్కడకు వెళ్ళి పనులు సరైన పద్ధతిలో జరుగుతున్నాయా లేదా పరిశీలించాలి. కార్యక్రమాలు సరైన పద్ధతిలో జరిగేలా చూడాలి..’ అంటూ ‘లీడర్’ ఎలా వుండాలన్న విషయమై రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. ‘లీడర్’ అనే పదం మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వున్న అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే.

మరి, ముఖ్యమంత్రి ఎలా వుండాలి.? వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తే, అక్కడి పరిస్థితులు ఎలా వుంటాయో అధికారులు వివరించారట. అధికారులు తాము చెయ్యాల్సిన పనులు మానేసి, ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైపోతారట. అందుకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి ఏంటి.? లీడర్ ఏంటి.? రెండూ ఒకటి కాదా.? ఒహో, అధికారంలో లేకపోతేనే, ప్రజలు కష్టంలో వున్నప్పుడు వెళ్ళి.. వారిని పరామర్శించి, వారికి అందుతున్న సాయం గురించి ఆరా తీయడంతోపాటు, వారికి సాయం అందేలా ప్రయత్నించాలా.? ముఖ్యమంత్రి అయితే మాత్రం, అధికారుల్ని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకూడదా.?

నిజమే, ముఖ్యమంత్రి పర్యటనకు వెళితే అధికారులు.. ఆ పర్యటన ఏర్పాట్లలో బిజీగా వుంటారు. ప్రోటోకాల్ వ్యవహారాలు వుండనే వుంటాయ్. అది అధికారులకు తలనొప్పి వ్యవహారమే. కానీ, ముఖ్యమంత్రి గనుక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే, ప్రజలకు కొంత భరోసా కలుగుతుంది. ఈ లాజిక్ ఎలా వైఎస్ జగన్ మిస్ అవుతున్నారట.?

‘లీడర్’ గురించి ముఖ్యమంత్రి చెప్పింది, చంద్రబాబు మీద విమర్శలు చేయడానికి. ‘సీఎం పర్యటన’ గురించి వైఎస్ జగన్ చెప్పింది, తన మీద వరద బాధిత ప్రజలు కావొచ్చు, విపక్షాలు కావొచ్చు.. చేస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికి. అద్గదీ అసలు సంగతి.


Recent Random Post: