విజయసాయిరెడ్డికి దేవినేని ఉమ పవర్ పంచ్.!

‘కబడ్దార్ తెగ్గోస్తా.. తొక్కిస్తా.. అంతు చూస్తా.. అని హూంకరించే ఉమా పరార్ అవడమేంటి? వీడియో మార్ఫింగ్ కేసులో ఇంటికి వెళ్ళిన కర్నూలు పోలీసుల కళ్ళు గప్పి పారిపోయాడు ఉమా. మొబైల్ స్వచాఫ్ చేసి దక్కోవడం ఏంటి అసహ్యంగా. లొంగిపోయి, నిర్దోసిత్వం నిరూపించుకో. మైలవరం నవ్వుతోంది..’ అంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీద తనదైన స్టయిల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేధికగా ప్రశ్నాస్త్రం సంధిస్తూ, ఉచిత సలహా ఇచ్చిన విషయం విదితమే. దీనికి దేవినేని ఉమ కూడా తగు రీతిలోనే రిటార్ట్ ఇచ్చారు.

‘సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిగా రెండేళ్ళుగా వాయిదాలు ఎగ్గొడుతున్న విజయసాయిరెడ్డి, బాబాయ్ ని ఎవరు చంపారు? కుట్లు వేసింది ఎవరు? రక్తపు మరకలు తుడిచింది ఎవరు? సీబీఐ ముందు చెప్పే ధైర్యం వుందా? గొడ్డలి పోటుని గుండె పోటుగా చెప్పిన ఘనుడివి. హూ కిల్డ్ బాబాయ్ అని రాష్ట్రం అడుగుతుంటే వైఎస్ జగన్ ఎందుకు చెప్పడేంలేదు?‘ అంటూ దేవినేని ఉమ ఎదురు ప్రశ్న వేశారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ ఇటీవల వేయించుకున్నాననీ, వైద్యుల సూచన మేరకు రెస్ట్ తీసుకున్నాననీ, అన్ని వివరాలూ త్వరలో మీడియా ముందుకొచ్చి చెబుతాననీ దేవినేని ఉమ అంటున్నారు. కాగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడినట్లుగా చెప్పబడుతోన్న ఓ వీడియో, దేవినేని ఉమ ఇటీవల విడుదల చేయడం వివాదాస్పదమయ్యింది. ఎలక్ట్రానిక్ మార్ఫింగ్.. అంటూ దేవినేని ఉమపై ఓ వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడి, ఆయన్ని వెతుకుతోంది.

దేవినేని ఉమ విషయాన్ని పక్కన పెడితే, విజయసాయిరెడ్డి.. ట్వీట్లేయడం కాదు, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంత నీతిమంతుడైతే బెయిల్ తెచ్చుకుని బయట తిరగడమెందుకు.? బెయిల్ రద్దు చేయించుకుని, కేసు విచారణకు పూర్తిగా సహకరించి, నిర్దోషిగా బయటకు రావొచ్చు కదా.? అన్నది చాలామంది సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్న ప్రశ్న. గొడ్డలి వేటుకి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే, గుండె పోటుతో మరణించడం బాధాకరం.. అని విజయసాయిరెడ్డి ఎలా చెప్పగలిగారు.? అన్నదీ కీలకమైన ప్రశ్నే. ఇవన్నీ సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి వైపుకు దూసుకెళుతున్నాయి. కానీ, ఆయన సమాధానం చెప్పరు, చెప్పలేరు. ఇతరుల మీద సెటైర్లు వేస్తారంతే… జస్ట్ గురివింద తరహాలో.


Recent Random Post: