రౌడీ ఫైటర్ ఇస్మార్ట్ లుక్ లో కిరాక్


రౌడీ విజయ్ దేవరకొండ స్టన్నింగ్ మేకోవర్ ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి అతడు మ్యాకో లుక్ కి మారిపోయాడు. 6 ప్యాక్ యాబ్స్ కోసం అతడు ఎంతగానో శ్రమిస్తున్నాడు. వీటన్నిటినీ మించి అతడు స్టైల్ ఐకన్ గా తనని తాను మలుచుకున్న తీరుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.

ట్రెండ్స్ పరంగా క్రేజు సృష్టించడంలో ఎనర్జిటిక్ రణవీర్ సింగ్ తరహాలోనే విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో న్యూ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం దేవరకొండ న్యూలుక్ కి సంబంధించిన ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది.

లేటెస్ట్ ఫోటోలో బ్లాక్ ఫ్యాంటుపై వైట్ స్టైలిష్ బాడీ ఫిట్ లాంగ్ షర్ట్ ని ధరించిన దేవరకొండ కాంబినేషన్ బ్లాక్ చెప్పల్స్ తో కనిపించాడు. అలా చైర్ లో రిలాక్స్ డ్ గా ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్న ఫోటో రియల్లీ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. స్టైల్ ఐకన్ కే బాప్ అని అనాలేమో! అన్నంతగా కనిపిస్తున్నాడు ఈ లుక్ లో. రౌడీ ఫైటర్ ఇస్మార్ట్ లుక్ అదిరింది గురూ అంటూ అభిమానులు వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. ఇకపోతే ఫైటర్ మూవీ కోసమే ఇదిగో ఇలా లాంగ్ హెయిర్ పెంచి కండలు పెంచాడు. లుక్ పరంగా చాలా మార్పులు తీసుకొచ్చాడు. పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలంటే ఇలా హార్డ్ వర్క్ తో పాటు క్రియేటివిటీ చూపించాల్సిందే..


Recent Random Post: