జగడం మళ్ళీ రామ్ తో తీస్తా: సుకుమార్

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కెరీర్ లో ప్లాపులు ఉన్నా కానీ అవి కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. అలాంటి సినిమాల్లో జగడం కూడా ఒకటి. ఎనర్జిటిక్ హీరో రామ్ తో సుకుమార్ చేసిన ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే ఈ సినిమాకు ఫ్యాన్స్ ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. జగడం సినిమా విడుదలై 17 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ సినిమా గురించి సుకుమార్ కొన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.

దేవదాస్ విడుదలైన వారం రోజుల తర్వాత స్రవంతి రవికిషోర్ ను కలిసి జగడం కథ చెప్పాను. వెంటనే నాకు ప్రాజెక్ట్ సెట్ అయింది. రామ్ నేను ఏది చెప్పినా నో అని మాత్రం అనలేదు. చాలా ఫాస్ట్ గా ఏదైనా నేర్చుకోగలడు రామ్. నేను చేసిన జగడం కొన్ని కారణాల వల్ల ప్లాప్ అయింది. అయితే నేను మళ్ళీ రామ్ తో జగడం సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాను అని తెలిపాడు.


Recent Random Post: