నాపై హత్యా ప్రయత్నం జరిగింది: శ్రీ సుధ

కొన్ని నెలల క్రితం టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై చీటింగ్ కేసు ఫైల్ చేసింది నటి శ్రీ సుధ. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్యామ్ తనను మోసం చేసాడని, తనను అన్ని విధాలా వాడుకున్నాడని శ్రీ సుధ ఆరోపించింది. ప్రస్తుతం ఈ కేసు హైదరాబాద్ లో నడుస్తుండగా తాజాగా తనపై హత్య ప్రయత్నం జరిగిందని ఆమె విజయవాడలో కేసు ఫైల్ చేసింది.

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పై తాను వెళుతుండగా వెనుకనుండి గుర్తు తెలియని వ్యక్తులు తన కారును గుద్ది పారిపోయారని, తాను చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డానని ఆమె ఆరోపిస్తోంది. ఇది కచ్చితంగా హత్య ప్రయత్నమే అని శ్రీ సుధ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసింది.

ఇది కచ్చితంగా శ్యామ్ చేసిన పనే అని ఆమె అంటోంది. తనే రౌడీలను పెట్టించి తనను చంపించాలనుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్నారు.


Recent Random Post: