పేదవిద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన సోనూసూద్..!!


దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి సినీనటుడు సోనూసూద్.. తనలోని సేవాగుణాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. సోనూసూద్ ప్రస్తుతం నటుడు మాత్రమే కాదు ఓ మంచి మనసున్న వ్యక్తి. ఎదురువారి ఆకలి తీర్చి కన్నీళ్లు తుడిచే మనస్తత్వం కలిగిన రియల్ హీరో. అయితే రీల్ లైఫ్ విలన్ గా పాపులర్ అయిన సోనూసూద్ నిజజీవితంలో ఆపద్భాందవుడుగా మారాడు. సోను వలసకార్మికుల కష్టాలు ఎరిగిన మనిషి. ఈ క్రమంలో ఉపాధి లేక చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేసి ఆదుకున్నాడు. ఇప్పటివరకు సోనూసూద్ ఛారిటీ సహాయంతో లక్షలమంది సహాయం అందించాడు. కేవలం ఒక్కడి తపన.. సంకల్పం అంతమందికి బతుకుబాట చూపించింది.

తాజాగా మరోసారి తన చల్లని మనసు చాటుకున్నాడు సోను. పాఠశాలకు వెళ్లే పిల్లలకు సుమారు 100 స్మార్ట్ ఫోన్లను ఆన్లైన్ తరగతుల కోసం నిరుపేద విద్యార్థులకు అందజేశాడు. స్మార్ట్ఫోన్లు కొనడానికి స్థోమత లేకపోవడంతో ఆన్లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నారని తెలుసుకున్న సోనూసూద్ వెంటనే స్పందించాడు. మహారాష్ట్రలోని కోపర్గావ్కు చెందిన ఆరు పాఠశాలల విద్యార్థులకు వారి ఆన్లైన్ తరగతులు కోల్పోకుండా సరికొత్త స్మార్ట్ఫోన్లు అందజేశాడు. సోనుసూద్ ఈ మంచిపనితో ఎన్నో లక్షల హృదయాలను గెలుచుకున్నాడు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు అందరూ సోనూసూద్ ను కొనియాడారు. సోనూసూద్ కి ఇది కొత్తకాదు. ఇదిలా ఉండగా.. ఇటీవల సోనూసూద్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా సంక్రాంతి విడుదలకు సిద్ధం అవుతోంది.


Recent Random Post: