మినపగుళ్ళను ప్రమోట్ చేయడానికి భారీ రెమ్యునరేషన్ తీసుకున్న సమంత

ప్రస్తుతం సమంత సినిమాలతో సంబంధం లేకుండా సూపర్బ్ క్రేజ్ ను ఎంజాయ్ చేస్తోంది. జాను వంటి ప్లాప్ తర్వాత మరో సినిమాలో సమంత నటించలేదు. అయితే ఆమెకు డిమాండ్ ఎక్కడా తగ్గింది లేదు. సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదల కావాల్సి ఉంది.

అలాగే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతువాకుల రెండు కాదల్ సినిమాను ఒప్పుకుంది. ఇక భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలంలో కూడా సమంత హీరోయిన్ అన్న విషయం తెల్సిందే. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు.

బ్రాండ్స్ ప్రమోటింగ్ విషయంలో కూడా సమంత ఎక్కడా తగ్గట్లేదు. తాజాగా మహేష్, ఎన్టీఆర్ తరహాలో లోకల్ బ్రాండ్స్ కు కూడా సమంత సై అంటోంది. విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు బ్రాండ్ కు సైన్ చేసింది సమంత.

దీనికి సంబంధించిన కమర్షియల్ ఇప్పుడు విడుదలైంది. ఈ బ్రాండ్ ప్రమోషన్ కోసం సమంత భారీ అమౌంట్ ను డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక సంవత్సరం పాటు ఆమె ఈ బ్రాండ్ ప్రమోషన్ కోసం సైన్ చేసింది.


Recent Random Post: