శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడంటే

రుద్రమదేవి దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సమంత శాకుంతలం షూటింగ్‌ ప్రారంభంకు అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్ లను నిర్మించడంతో పాటు నటీ నటుల ఎంపిక కార్యక్రమం కూడా చకచక జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే నెల 20నుండి ప్రారంభించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఒక అటవి మద్యలో కుటీరం సెట్టింగ్‌ ను ఇప్పటికే వేయించిన గుణశేఖర్‌ దానికి హంగులు అద్దిస్తున్నాడట.

మెజార్టీ పార్ట్‌ షూటింగ్‌ ను ఆ సెట్‌ లోనే చేయబోతున్న చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందించడంతో పాటు సమంత అభిమానులకు ఆమెను సరికొత్తగా చూపించేందుకు దర్శకుడు గుణ ప్లాన్‌ చేస్తున్నాడు. స్వీయ నిర్మాణంలో గుణశేఖర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సమంత ఛారిత్రాత్మక సినిమా చేస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సమంత విషయంలో అత్యంత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గుణశేఖర్ ఇతర నటీనటుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటున్నట్లుగా సమాచారం అందుతోంది.


Recent Random Post: