ప్రభాస్‌, పూజల మరో రొమాంటిక్ సాంగ్‌


ప్రభాస్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ వారం పది రోజులు మినహా పూర్తి అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మరో రొమాంటిక్ సాంగ్‌ ను యాడ్ చేయబోతున్నారు. దానికి అదనంగా వారం నుండి పది రోజుల సమయం పడుతుందని అంటున్నారు. బాలీవుడ్‌ లో ఈ సినిమాను దక్కించుకున్న నిర్మాతలు ప్రమోషన్‌ కోసం రొమాంటిక్ సాంగ్‌ కావాలంటూ డిమాండ్‌ చేశారట. అందుకు యూవీ వారు ఓకే చెప్పారు.

రాధేశ్యామ్‌ సినిమా లో ఇప్పటికే రెండు మూడు పాటలు ప్రభాస్ మరియు పూజాల కాంబోలో ఉన్నాయి. కాని వాటిని మించి రొమాంటిక్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక పాటను చిత్రీకరించబోతున్నారు. ఆ పాటలో పూజా అందాలతో పాటు చాలా రొమాంటిక్ గా ఉంటుందని అంటున్నారు. ముద్దు సన్నివేశాలు కూడా ఆ పాటలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన సమయంలో ఈ పాట అదనంగా షూటింగ్‌ చేయాల్సి వచ్చిందని మేకర్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ పాటకు సెట్‌ ను వేయిస్తున్నారట.


Recent Random Post: