నిజంగా పేలిన బాంబు.. షూటింగ్‌ లో హీరోకు గాయాలు

ఈమద్య హీరోలు యాక్షన్‌ సన్నివేశాలకు డూప్ లను పెద్దగా వినియోగించడం లేదు. గతంలో చిన్న యాక్షన్‌ సన్నివేశం అయినా కూడా డూప్ లను వినియోగించే వారు. కాని రియాల్టీ కోసం హీరోలు సొంతంగానే యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నారు. దాంతో కొందరు హీరోలు అవగాహణ రాహిత్యంతో షూటింగ్‌ సమయంలో గాయాల పాలు అవుతున్నారు. ఇటీవల కన్నడ హీరో రిషబ్‌ శెట్టి కూడా ఇలాగే షూటింగ్ లో గాయ పడ్డాడు. ఆయన కు తీవ్రమైన గాయాలు అయినట్లుగా కన్నడ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కన్నడ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారి కథనం ప్రకారం.. ‘హీరో’ సినిమా షూటింగ్‌ సందర్బంగా పెట్రోల్‌ బాంబును హీరో రిషబ్‌ శెట్టి పైకి విసరాల్సి ఉంటుంది. ఆసమయంలో హీరో పక్కకు జరగాలి. కాని కాస్త ఆలస్యంగా మూవ్‌ అవ్వడంతో అప్పటికే మంటలు అంటుకుని నిజంగానే పెట్రోలు బాంబు పేలి రిషబ్ కు గాయాలు అయ్యాయి. దాంతో వెంటనే షూటింగ్ ను నిలిపి వేసి స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ సంఘటన హాసన్ జిల్లా బేలూరు లో జరిగినట్లుగా చెబుతున్నారు.


Recent Random Post: