చిరు క్లాసిక్ టైటిల్ ను టచ్ చేయబోతోన్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ సూపర్బ్ ఫామ్ ను అందుకున్నాడు. ఈ ఏడాది క్రాక్ తో మరపురాని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. క్రాక్ తర్వాత రవితేజ చేస్తోన్న సినిమా ఖిలాడీ. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం మే 28న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా తర్వాత రవితేజ తన నెక్స్ట్ సినిమాను కూడా ప్రకటించేశాడు.

కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నటించబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి చిరు క్లాసిక్ టైటిల్ ను టచ్ చేయబోతున్నారన్న వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో షికార్లు చేస్తోంది. చిరంజీవి డిటెక్టివ్ పాత్రలో నటించిన చంటబ్బాయ్ అందరి ఫెవరెట్ అన్న విషయం తెల్సిందే.

రవితేజ – త్రినాథరావు నక్కిన చిత్రానికి కూడా ఇదే టైటిల్ ను అనుకుంటున్నారు. రవితేజ డిటెక్టివ్ తరహా పాత్రలో నటించబోతుండడంతో ఈ టైటిల్ అయితే సరిగ్గా సూట్ అవుతుందని భావిస్తున్నారు.


Recent Random Post: