సుధీర్ తో పెళ్లిపై రష్మీ పూర్తి క్లారిటీ!

సుడిగాలి సుధీర్, రష్మీ అన్నది ఎవర్ గ్రీన్ పెయిర్. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వీరిద్దరి ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ మొదలైంది. దాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుండడంతో నిర్వాహకులు కూడా వీరి లవ్ స్టోరీని ప్రోత్సహించారు. జబర్దస్త్ నుండి మొదలైన వీరి ప్రయాణం అటు ఢీలో కూడా కొనసాగుతోంది. ఇన్నేళ్ళైనా వీరి లవ్ స్టోరీ ఎవర్ గ్రీన్ గా సాగుతుండడం కొసమెరుపు.

ఇక రష్మీ-సుధీర్ పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఆన్ స్క్రీన్ పై ఉన్నట్లుగా వీరి బంధం ఆఫ్ స్క్రీన్ లో కూడా ఉంటుందా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అసలు నిజంగా వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉందా?

తాజాగా రష్మీని ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం అడగ్గా ఆమె కుండబద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పింది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆమె చెప్పేసింది. అయితే కొంత కాలం తర్వాత పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని అయితే ఆ వ్యక్తి ఎవరైనా కావొచ్చు అంటూ మళ్ళీ సస్పెన్స్ లో పెట్టేసింది.


Recent Random Post: