‘చెక్‌’ ప్రమోషన్‌ లో ఆమె కనిపించడం లేదేం?

నితిన్‌ హీరోగా ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్‌ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ముఖ్య పాత్రలో చంద్ర శేఖర్‌ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చెక్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్‌ లో నితిన్‌ మరియు ప్రియా ప్రకాష్ వారియర్‌ మాత్రమే పాల్గొంటున్నారు. సినిమాలో కీలక పాత్రలో కనిపించిన రకుల్‌ మాత్రం ప్రమోషన్‌ లో కనిపించడం లేదు. చిన్న పాత్ర చేసిన వారు కూడా ప్రమోషన్ లో సందడి చేస్తూ ఉంటారు. కాని నితిన్ సినిమాలో రకుల్‌ కీలక పాత్ర చేసినప్పటికి కూడా ఎందుకు ప్రమోషన్ లో కనిపించడం లేదు అంటూ టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రమోషన్‌ కార్యక్రమాలకు రకుల్‌ హాజరు కాకపోవడం పట్ల చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందిస్తూ ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేక పోతుందని చెప్పారు. కాని అసలు విషయం ఏంటీ అంటే ఈ సినిమాలో ఒక పాటను రకుల్‌ తో చిత్రీకరించాల్సి ఉండగా దర్శకుడు క్యాన్సిల్‌ చేశాడట. తన పాత్ర పరిధిని మొదట చెప్పినంతగా చూపించక పోవడం వల్లే రకుల్‌ ప్రమోషన్స్ కు నో చెబుతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. లాయర్ పాత్రలో రకుల్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా ట్రైలర్‌ ను బట్టి అర్థం అవుతుంది.


Recent Random Post: