బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే యాక్షన్ బ్లాక్ ను సెట్ చేసిన సుకుమార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. పుష్ప టీజర్ కొన్ని వారాల క్రితం విడుదల కాగా అది అందరినీ ఇంప్రెస్ చేసిన విషయం తెల్సిందే. పుష్ప చిత్రం గురించి బయటకు వస్తోన్న ఒక్కో అప్డేట్ బన్నీ ఫ్యాన్స్ కు ఉత్సాహం తెప్పిస్తున్నాయి.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం పుష్ప యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశం ఒక ఊర మాస్ సీన్ అని అంటున్నారు. ఈ సీన్ లో అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకుని తన దగ్గరనుండి ఎర్ర చందనం దొంగిలించడానికి వచ్చిన గుండాలను అటాక్ చేస్తోన్న సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు సమాచారం.

ఈ సన్నివేశం పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో షూట్ చేసినట్లు అర్ధమవుతోంది. ఈ ఫైట్ సూపర్బ్ గా వచ్చిందని పుష్ప మెయిన్ హైలైట్స్ లో ఒకటిగా కచ్చితంగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు.


Recent Random Post: