లేదంటూనే సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాలు చేయాలని ప్రతీ డైరెక్టర్ ఎదురుచూస్తున్నారు. `బాహుబలి` తరువాత ఆయన రేంజ్ పెరిగిపోవడంతో తనతో ఒక్క సినిమా చేసినా చాలాని ప్రతీ దర్శకుడు భావిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకోవచ్చని ప్లాన్ లు వేసుకుంటున్నారు.

డైరెక్టర్ మారుతి కూడా గత కొంత కాలంగా భారీ సినిమా చేయాలని ఆలోచిస్తున్నారు. బన్నీ కోసం గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న మారుతి కన్ను ఇప్పడు ప్రభాస్ పై పడింది. తనతో సినిమా చేయాలని భారీ స్కెచ్ వేసినట్టుగా వార్తులు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

త్వరలో ప్రభాస్ తో మారుతి భారీ చిత్రాన్ని చేయబోతున్నారంటూ ఓ వార్తల చక్కర్లు కొడుతోంది. సినిమా టైటిల్ అండ్ కీలక టీమ్ ఇదేనంటూ కూడా ఓ వార్త బయటికి వచ్చేసింది. కూడా కానీ ఈ వార్తలు ఊహాగానాలని ప్రభాస్ తో సినిమాకు సంబంధించిన విషయాల్ని సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని సోషల్ మీడియా వేదికగా మారుతి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

మారుతితో ప్రభాస్ సినిమా అనగానే ఇండస్ట్రీలో చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు కూడా.ఇలాంటి బిజీ షెడ్యూల్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైన్ లో పెట్టిన ప్రభాస్ పనిలో పనిగా మారుతికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ నిజమా? కాదా? అని ఓ పక్క చర్చ జరుగుతుంటే మారుతి ఆ వార్తల్లో నిజం లేదని ప్రకటించారు.

ప్రాజెక్ట్ చేయడం లేదని అవన్నీ పుకార్లని కొట్టి పారేసిన మారుతి సైలెంట్ గా మాత్రం తన పని తాను చేయడం మొదలుపెట్టాడు. ప్రభాస్ తో సినిమా లేదు లేదంటూనే సైలెంట్ గా తన టీమ్ తో ప్రభాస్ కు సరిపడే కథని సిద్ధం చేసే పనిలో పడ్డారు.

ఫాస్ట్ గా ఫస్ట్ హాఫ్ ని పూర్తి చేసి ప్రభాస్ కు వినిపించేయడం.. నచ్చితే అధికారికంగా ప్రభాస్ నుంచి ప్రకటన వచ్చేయడం చక చకా జరిగిపోవాలని మారుతి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ మూవీ ప్రభాస్ స్టైల్లో కాకుండా మారుతి స్టైల్లోనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వుంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ కోసం ముగ్గురు రైటర్లలో కలిసి మారుతి కథని సిద్ధం చేసే పనిలో వున్నారట. ఈ చిత్రంలో తొలిసారి ముగ్గురు హీరోయిన్ లు ప్రభాస్ తో రొమాన్స్ చేస్తారట. హారర్ జోనర్ లో ఈ మూవీ వుంటుందని కొంత మంది ప్రచారం చేస్తుంటే లేదు మారుతి మార్కు అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలైనట్టుగా తెలుస్తోంది. డీవీవీ దానయ్య లేదా మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు వున్నాయని చెబుతున్నారు. అయితే డీవీవీ దానయ్య నే ఈ మూవీని నిర్మిస్తారని తాజా సమాచారం. ఇప్పటికే ఆయన హీరో ప్రభాస్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చేడంతో ఆయనే ప్రొడ్యూసర్ అని కన్ఫామ్ అయిందని చెబుతున్నారు.


Recent Random Post: