బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గ్లామరస్ హీరోయిన్..??

తెలుగు టీవీ స్క్రీన్ పై ఎంటర్టైన్మెంట్ అందించే రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షోకు ప్రేక్షకులలో క్రేజ్ మాములుగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షో క్రమం తప్పకుండా చూసే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారంటే నమ్మాల్సిందే. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు కూడా ఈసారి ఐదవ సీసన్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అలాగే బిగ్ బాస్ చూసే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరిగుతూనే ఉంది. అలా బిగ్ బాస్ ఐదవ సీసన్ కోసం ఎంత ఆసక్తిగా ఉన్నారో షో ప్రోమోకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే అర్ధమవుతుంది. ఏంటి ఇంతలా వెయిట్ చేస్తున్నారా అనే సందేహం కలగొచ్చు.

కానీ ఆ కోవకు చెందిన లిస్ట్ కూడా బాగానే ఉంది. అంటే సమయాన్ని బట్టి పనిలో నిమగ్నమై ఉండేవారు సైతం వెయిట్ చేస్తున్నారు. అయితే త్వరలోనే బిగ్ బాస్ 5వ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుందని ఇదివరకే స్టార్ మా యాజమాన్యం తెలిపింది. చూస్తుంటే నిజంగానే ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారని అనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ బిగ్ బాస్ మొదలై విజయవంతంగా నాలుగు సీజన్లు సక్సెస్ అయింది. ఈ రియాలిటీ షోను మొదటగా ఎన్టీఆర్.. నాని తర్వాత కింగ్ నాగ్ వరుసగా హోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐదవ సీజన్ కూడా ఆయనే హోస్ట్. ఈ మధ్యలో కరోనా రావడంతో బిగ్ బాస్ న్యూ సీసన్ బ్రేక్ పడింది.

అయితే త్వరలోనే బిగ్ బాస్ మొదలవుతుంది అనేసరికి ఫ్యాన్స్ లో కంటెస్టెంట్స్ ఎవరనే ఆసక్తి మొదలైంది. ఈసారి బిగ్ బాస్ న్యూ సీసన్ లో టాలీవుడ్ మీడియం స్టార్స్ దిగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ నిర్వాహకులు హీరోయిన్ పాయల్ రాజపుత్ ను సంప్రదించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఆ రూమర్స్ మాత్రమే అని అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఐదవ సీసన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని టాక్. చూడాలి మరి కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారో..!


Recent Random Post: