‘సినిమాపై తపన కలిగిన వ్యక్తి’.. బిఎ రాజు మృతిపై పవన్ కల్యాణ్ సంతాపం


ప్రముఖ సినీ పీఆర్వో, జర్నలిస్ట్, సూపర్ హిట్ సినిమా పత్రిక అధినేత, నిర్మాత బిఎ రాజు ఈరోజు ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ఓ ప్రకటనలో తెలిపారు. ‘జర్నలిస్టుగా, పీఆర్వోగా తెలుగు సినీ రంగంలో సుపరిచుతులైన శ్రీ బిఎ రాజు గారు మరణం దిగ్భ్రాంతకి గురి చేసింది. ఆయనతో చెన్నైలో ఉన్నప్పటి నుంచీ పరిచయం ఉంది. సినిమా అంటే ఎంతో తపన కలిగిన జర్నలిస్టు ఆయన’.

‘అన్నయ్య చిరంజీవి గారి పలు సినిమాలకు పీఆర్వోగా బాధ్యతలు చూశారు. సూపర్ హిట్ సంపాదకులుగానే కాకుండా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలబడ్డారు. ఆయన మృతి సినీ రంగానికి లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని అన్నారు.


Recent Random Post: