పవన్‌ స్ఫూర్తితో రామ మందిర నిర్మాణంకు పవన్ నిర్మాతల భారీ విరాళం

అయోద్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ తరపున రూ.30 లక్షలు విరాళాలు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక పవన్ స్ఫూర్తితో ఆయనతో ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు భారీ విరాళాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ తో సినిమాలు నిర్మిస్తున్న దిల్ రాజు, ఏఎం రత్నం, చిన్నబాబు, నవీన్ ఎర్నేని, బండ్ల గణేష్‌ లు కలిసి మొత్తంగా రూ.54.51 లక్షల విరాళంను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయంను అధికారికంగా ప్రకటించారు.

పవన్‌ కళ్యాణ్‌ కు నిర్మాతలు ఆ మొత్తం అందించగా.. దాన్ని హైదరాబాద్‌ ప్రాంత ప్రచారక్‌ అయిన శ్రీ దేవేందర్‌ కు పవన్ దాన్ని అందించారు. అయోధ్య రామాలయ నిర్మాణంకు పవన్‌ నుండి ఇప్పటికే 30 లక్షలు విరాళంగా అందగా ఇది అదనం అనుకోవచ్చు. పవన్‌ పిలుపు మేరకు ఈ నిర్మాతలు ముందుకు వచ్చి తమ వంతు ఇవ్వడం జరిగిందని అంటున్నారు. ఇది ఖచ్చితంగా మంచి పరిణామం అంటూ రాజకీయ వర్గాల వారు మరియు సినీ వర్గాల వారు అంటున్నారు.

Share


Recent Random Post: