వచ్చే వారమే ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై హోస్ట్ గా తన ప్రభావం ఎలాంటిదో ఇప్పటికే ఒక సారి నిరూపించాడు. బిగ్ బాస్ సీజన్ 1 కు హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ను ఇప్పటికీ బెస్ట్ హోస్ట్ గా అభిప్రాయపడుతుంటారు చాలా మంది. ఇదిలా ఉంటే దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ మరోసారి హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

మీలో ఎవరు కోటీశ్వరుడు లేటెస్ట్ సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే ప్రోమోకు సంబంధించిన షూటింగ్ కు జరిగింది. ఇదిలా ఉంటే ఈ ప్రోమోను వచ్చే వారం విడుదల చేయనున్నారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. వచ్చే నెల నుండే కొత్త సీజన్ ను మొదలుపెట్టబోతున్నారు. మరిన్ని విశేషాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉంటోన్న విషయం తెల్సిందే.


Recent Random Post: