చిరు సినిమాకు ఆమె రూ.4 కోట్లు నిజమా?


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో కీలక పాత్రను నయనతార చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఒరిజినల్ వర్షన్ లూసీఫర్ లో హీరోయిన్ పాత్ర ఉండదు. హీరో సోదరి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. కనుక ఆ పాత్రకు గాను నయనతారను తీసుకుని ఉంటారు అంటున్నారు. ఆ పాత్రకు గాను పలువురు హీరోయిన్స్ ను పరిశీలించిన మేకర్స్ చివరకు ఆమెను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఆ పాత్రకు నయన్ పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్బంగా అఫిషియల్ గా గాడ్ ఫాదర్ లో నయనతార నటిస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సమయంలో ఆమె పారితోషికం గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.

లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళంలో ఈమద్య కాలంలో చేసిన పలు సినిమాలకు 3.5 కోట్ల నుండి 4.5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా తమిళ మీడియా వర్గాల వారు చెబుతున్నారు. హీరోల రేంజ్ లో ఈ అమ్మడి పారితోషికం పెరుగుతూ వస్తోంది. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అయితే ఈ రేంజ్ పారితోషికం సరే కాని.. హీరోలతో కలిసి నటించే సినిమాలకు ఇంత పారితోషికం అంటే ఖచ్చితంగా కష్టమే అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లేడీ ఓరియంటెడ్ సినిమా ను మొత్తం బాధ్యతను తన మీద వేసుకుని మోయాల్సి ఉంటుంది కనుక ఆ రేంజ్ పారితోషికం అర్హం. కాని హీరోతో కలిసి నటించే సినిమాలో పాత్రకు ప్రాముఖ్యత తక్కువ ఉండటంతో పాటు ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది. అందుకే పారితోషికం చాలా తక్కువగా ఉంటుందని అందరి అభిప్రాయం.

తాజాగా గాడ్ ఫాదర్ సినిమా కోసం ఈమె ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలు ఆశ్చర్యంగా ఉన్నాయి. సినీ జనాలతో పాటు మీడియా వర్గాల వారు కూడా నయన్ కు నాలుగు కోట్లు నిజం అయ్యి ఉంటుందా అంటూ చర్చించుకుంటున్నారు. చిరంజీవి సినిమాలో ఇతర నటీ నటులకు అంత పారితోషికం ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. ఒక వేళ అదే కనుక నిజం అయితే ఖచ్చితంగా రికార్డు అనడంలో సందేహం లేదు.

హీరోయిన్ కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినందుకు అంత పారితోషికం దక్కడం నిజంగా చాలా పెద్ద విషయం అనడంలో సందేహం లేదు. నయనతార గతంలో చిరంజీవితో జోడీగా సైరాలో హీరోయిన్ గా నటించిన సమయంలో రెండు కోట్ల లోపు పారితోషికంనే తీసుకుందట. ఇంతలో ఇంత మార్పు ఏంటో అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ పారితోషికం వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే గాడ్ ఫాదర్ నిర్మాత లేదా దర్శకుడు మోహన్ రాజా స్పందించాల్సిందే. కాని వారు స్పందించే అవకాశమే లేదు. కనుక ఈ విషయం అలా సశేషంగా మిగిలి పోవాల్సిందేనేమో.


Recent Random Post: