మాటలు చెప్పే బదులు ఒక వీడియో పెట్టిచ్చొచ్చుగా నాగబాబు?


మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. గత నెలలో స్పోర్ట్స్ బైక్ మీద వెళుతూ.. రోడ్డు మీద మట్టి మేట ఉండటం.. ఆ సమయంలో బైక్ ను కంట్రోల్ చేయటంలో జరిగిన తప్పు ఆయనకు యాక్సిడెంట్ అయ్యేలా చేసింది. అంతర్గత రక్తస్రావం జరగలేదని.. పెద్ద దెబ్బలు పెద్దగా లేవని చెప్పినప్పటికీ.. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు అవుతున్నా.. బయటకు రాకపోవటం తెలిసిందే. మొన్నీ మధ్యనే సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ విడుదల కావటం.. ఈ సినమా రిలీజ్ కు ముందు జరిగిన ప్రీరిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మేనమామ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తేజ్.. ఇంకా కళ్లు తెరవలేదంటూ మీడియా కథనాల మీద ఆగ్రహావేశాల్ని ప్రదర్శించటం తెలిసిందే.

సినిమా విడుదలైన తర్వాత తేజ్ నుంచి ఒక పోస్టు వచ్చినా.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అయితే లభించలేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. సాయి ధరమ్ తేజ్ మరో 30 నుంచి 40 రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడని చెప్పారు. తేజ్.. రెండు నెలల వ్యవధిలోనూ షూటింగ్ ల్లో పాల్గొనాలన్న పట్టుదలతో ఉన్నాడని.. తాము మాత్రం అతన్ని మరికొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు వెల్లడించారు.

సాయి ధరమ్ తేజ్ చాలా వేగంగా కోలుకుంటున్నట్లుగా నాగబాబు వెల్లడించారు. తేజ్.. ఆరోగ్యంపై మాటలు చెప్పే కన్నా.. ఏదైనా వీడియోను విడుదల చేసి ఉంటే బాగుండేది. అతడి ఆరోగ్యం ఎలా ఉందన్న ఆందోళన చెందుతున్న వారికి సదరు వీడియో రిలీఫ్ గా ఉండేదని చెప్పక తప్పదు. మరి.. ఇప్పటికైనా నాగబాబు ఆ పని చేస్తే బాగుంటుందేమో? కాస్త ఆలోచించరు?


Recent Random Post: