ట్రెండీ ఫోటోషూట్: ఆయనతో మెహ్రీన్ సాన్నిహిత్యం


క్రైసిస్ ఖాళీ సమయం బ్యాచిలర్లకు ఒక దారి చూపిస్తున్న సంగతి తెలిసిందే. 2020 లాక్ డౌన్ క్రైసిస్ లోనే రానా- నితిన్-నిఖిల్ లాంటి హీరోలు పెళ్లితో ఓ ఇంటివాళ్లయ్యారు. ఇక అదే సీజన్ లోనే కాజల్ కూడా తాను ప్రేమించిన స్నేహితుడిని పెళ్లాడారు. ఇటీవల మెహ్రీన్ ఫీర్జదా కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమవివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

అందాల కథానాయిక మెహ్రీన్ కౌర్ హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనవడు .. కాంగ్రెస్ లీడర్ భవ్య బిష్ణోయ్ ని పెళ్లాడనున్నారు. మార్చి 12న జైపూర్ లోని ఆలియా ఫోర్ట్ లో ఈ జంట నిశ్చితార్థం జరిగింది. అనంతరం నిశ్చితార్థ ఫోటోలు.. ఆ తర్వాత ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు.. వైరల్ అయ్యాయి.

తాజాగా మరోసారి ఈ జంటకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ ఫోటోలు అభిమానుల్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో మెహ్రీన్ భవ్య ట్రెడిషనల్ వేర్ లో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. జైపూర్ లోని ఆలియా ఫోర్ట్ పరిసరాల్లో పెళ్లికొడుకుతో పాటు మెహ్రీన్ ఫోటోషూట్ ఇంతకుముందు వైరల్ అయ్యింది. ఇప్పుడు మరోసారి హబ్బీతో ఉన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆయనతో సాన్నిహిత్యంలో రొమాంటిక్ గా కనిపిస్తున్న మెహ్రీన్ ఫోటోలు యువతరంలో హాట్ టాపిగ్ మారాయి.

`అవర్ ఫెయిరీ టేల్ బిగిన్స్..` అన్న క్యాప్షన్ తో పెళ్లి వేడుకలు సాగుతున్నాయి. త్వరలోనే పెళ్లి ఘనంగా జరగనుంది. ఈలోగానే మెహ్రీన్ ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్లు వైరల్ అవుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావంతో ఎఫ్ 3 సహా సెట్స్ పై ఉన్న చాలా సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. మెహ్రీన్ ఎఫ్ 3 చిత్రీకరణ ప్రారంభం కాగానే సెట్స్ లో జాయిన్ కావాల్సి ఉంటుంది.


Recent Random Post: