మెగాడాటర్ ‘వెబ్ సిరీస్’ బడ్జెట్ అన్ని కోట్లా..??


లాక్ డౌన్ సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ ఆహా హాట్ స్టార్ లాంటి ఓటిటిలు ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాయి. అంతేగాక కొత్తకొత్త ఓటిటిలు కూడా ఎన్నో పుట్టుకొచ్చాయి. అయితే ఓటిటి అనేది వెలుగులోకి వచ్చినప్పటి నుండి వెబ్ సిరీస్ అనే పదం ఎక్కువగా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే లాక్ డౌన్ ముందు వరకు తెలుగు జనాలకు ఓటిటిల గురించి వెబ్ సిరీస్ ల గురించి పెద్దగా తెలియదు.

ఎప్పుడైతే లాక్ డౌన్ టైం ఓటిటిలలో సినిమాలు వెబ్ సిరీస్ లు చూసారో అలా అలవాటు పడిపోయారు. ఇప్పుడు వెబ్ సిరీస్ లను తీసే మేకర్స్ కూడా వందలలో రెడీ అయిపోయారు. అయితే వెబ్ సిరీస్ అనేది ఇంతకుముందు పెద్దగా సినిమా యాక్టర్స్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కొత్తవారి దగ్గర నుండి స్టార్ హీరోలు హీరోయిన్స్ వరకు అంతా ఓటిటిలలో వర్క్ చేస్తున్నారు.

అయితే టాలీవుడ్ లో ఆహా ఓటిటి వచ్చాక వెబ్ సిరీస్ లు రూపొందించడం బాగానే వేగం పుంజుకుంది. వెబ్ సిరీస్ లతో కొత్తవాళ్లకు కూడా అవకాశం లభిస్తుంది. అయితే మెగాడాటర్ నిహారిక యాంకర్ అనసూయతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుందని అందరికి తెలిసిందే. రాయుడు చిత్రాలు బ్యానర్ పై భాను రాయుడు ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమంతో లాంచనంగా ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్ లో యూట్యూబర్ నిఖిల్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ విషయంలో కొన్ని వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ 6 కోట్లవరకు అంచనా వేస్తున్నారట. ఒక వెబ్ సిరీస్ కు ఇంత బడ్జెట్ ఎందుకు పెడుతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. అయితే ఈ వెబ్ సిరీస్ నిర్మాణంలో నిహారిక భర్త చైతన్య కూడా భాగమేనట. ఈ వెబ్ సిరీస్ కోసం అతను దాదాపు 3కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. చూడాలి మరి అంతలా కోట్లు పెట్టి ఏం తీస్తున్నారో అంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Recent Random Post: