షూటింగ్ లో హీరోయిన్ కి గాయం

సినిమా తారలను వెండి తెరపై చూసిన సమయంలో ఆహా ఓహో అంటూ ఉంటా… జనాల్లోకి వచ్చిన సమయంలో వారికి ఉన్న ఫాలోయింగ్ చూసి అబ్బా అనుకుంటాం. కాని షూటింగ్ సమయంలో వారు పడే కష్టం గురించి మాత్రం చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. హాయిగా షూటింగ్ లో పాల్గొంటారని అంతా అనుకుంటారేమో. కాని షూటింగ్ అంత ఈజీ ఏం కాదు. ముఖ్యంగా హీరో హీరోయిన్ లుగా నటించే వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కో సన్నివేశాన్ని అయిదు పది సార్లు కొన్ని సన్నివేశాలు అంతకు మించిన సార్లు షూట్ చేయాల్సి ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో పలువురు హీరోలు గాయ పడ్డట్లుగా మనం వార్తల్లో రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం.

హీరోయిన్స్ కూడా షూటింగ్ సమయంలో గాయ పడుతూ ఉంటారు. అసలే సుకుమారాలు అయిన హీరోయిన్స్ చిన్న పాటి గాయం అయిన బాబోయ్ అంటూ హడావుడి చేస్తారు. కొందరు మాత్రం చిన్న గాయంకు పెద్ద ఇష్యూ చేయకుండా లైట్ తీసుకుని షూటింగ్ లో కంటిన్యూ అవుతారు. తాజాగా హీరోయిన్ మాళవిక మోహన్ కూడా షూటింగ్ సందర్బంగా గాయ పడింది. ఆమె చేతికి కాస్త గట్టిగానే దెబ్బ తలిగింది. దాంతో ఆమె చేయి బాగా కంది పోయింది. తన చేతి గాయంను చూపిస్తూ ముద్దుగుమ్మ మాళవిక ఫొటోలను ఇన్ స్టా లో షేర్ చేసింది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఇలాంటి గాయాలు అప్పుడప్పుడు అవుతూనే ఉంటాయంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇక ఈమె సినిమాల విషయంకు వస్తే రజినీకాంత్ తో పేట సినిమా లో నటించి ఒక్క సారిగా ఇండస్ట్రీ దృష్టినిఆ కర్షించింది. తమిళంలో ఈ అమ్మడు ఆ తర్వాత మాస్టర్ సినిమాను కూడా చేసింది. మాస్టర్ తో ఈమె తమిళనాట టాప్ హీరోయిన్స్ జాబితాలో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ధనుష్ తో ఒక సినిమాను చేస్తున్న ఈ అమ్మడు వచ్చే ఏడాదిలో తెలుగు లో కూడా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉన్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలు చేయబోతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.


Recent Random Post: